న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ప్రపంచ మేటి ఆల్ రౌండర్లలో ఒకడైన క్రిస్ కెయిన్స్ పై దైవం పగబట్టాడా.? అన్నట్లు మారుతోంది ఆయన పరిస్థితి. తన కోసం ఏమీ మిగుల్చుకోకుండా.. సంపాదించిన డబ్బంతా క్రికెట్ కోసమే వెచ్చించిన ఈ మేటి ఆటగాడికి ఆ మధ్య గుండె సంబంధిత జబ్బుతో అసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అక్కడ ఐసీయూ వార్డులో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడని వార్తలు వచ్చాయి కూడా. అయితే చికిత్సకు ఆయన మెరుగ్గా స్పందిస్తున్నారని, ఆయన ఆరోగ్యం కూడా నిలకడగా వుందని వైద్యులు తెలిపారు.
కాగా, తాజాగా అతనికి గుండెను శస్త్రచికిత్స చేసి.. ఆయనను పూర్వపు మనిషిలా తిరిగి ఫిట్ గా చేద్దామని భావించిన వైద్యుల ప్రయత్నాలను దేవుడు అడ్డుకున్నాడా.? అన్నట్లు అనిపిస్తోంది. క్రిస్ కెయిన్స్ కు ఆపరేషన్ చేస్తుండగా.. అదే సమయంలో స్ట్రోక్ వచ్చిందని, దీంతో కెయిన్స్ కాళ్లకు పక్షవాతం వచ్చినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ నెల మొదట్లో అతన్ని క్యాన్ బెరాలోని అసుపత్రిలో అడ్మిట్ చేయగా.. సర్జరీ కోసం సిడ్నీకి తరలించారు. అక్కడ అత్యవసరంగా సర్జరీ నిర్వహించినా.. ఇప్పుడు కాళ్లకు పక్షవాతం రావడంతో కెయిన్స్ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు.
కాళ్లు చచ్చుబడిపోవడంతో ఆస్ట్రేలియాలోనే మరో స్పెషలిటీ ఆసుపత్రిలో కెయిన్స్‌కు రీహాబిలిటేషన్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. సిడ్నీలో సర్జరీ తర్వాత కెయిన్స్‌ను కుటుంబ సభ్యులు మళ్లీ క్యాన్‌బెరాకు తీసుకొచ్చారు. ఈ కష్ట సమయంలో కెయిన్స్ కోలుకోవాలని ప్రార్థిస్తున్న అందరికీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. న్యూజిలాండ్ తరఫున కెయిన్స్ 1989 నుంచి 2004 మధ్య 62 టెస్టులు ఆడాడు.
(And get your daily news straight to your inbox)
Jun 11 | ఐపీఎల్ 2022లో మెరిసిన టాలెండెడ్ ఇండియన్ యువ ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు. అయితే వారిలోనూ మెరుగ్గా రాణించి.. ఏకంగా టీమిండియా సెలక్టర్ దృష్టిలో పడిన ఆటగాడు ఉమ్రాన్ మాలిక్ అని చెప్పడంలో సందేహమే లేదు.... Read more
Jun 11 | క్రికెట్లో కొన్నిసార్లు ఆటగాళ్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. అయితే ఇలాంటి దుందుడుకు చర్యలకు ఆటగాళ్లు పాల్పడిన నేపథ్యంలో వారి జట్టు సారధి వారిని వారించి.. జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తాడు. అయితే కంచే చేసు మేసినట్లు..... Read more
Jun 11 | వరుస గాయాలు, పనితీరులో వైఫల్యంతో టీమిండియా జట్టుకు కొంత కాలం పాటు దూరమైన హార్థిక్ పాండ్యా.. దక్షిణాఫ్రికాతో సిరీస్ తో మళ్లీ చోటు సంపాదించుకోవడం తెలిసిందే. దీనిపై పాండ్యా తాజాగా స్పందించాడు. జట్టుకు దూరమైనప్పుడు... Read more
Jun 11 | న్యూజిలాండ్ క్రికెటర్ డారెల్ మిచ్చెల్ తాను మైదానంలో ప్రత్యర్థి జట్టుతో క్రికెట్ అడుతుండగా.. అదే మైదానం నుంచి క్రికెట్ వీక్షిస్తున్న అభిమాని బీర్ తాగుతుండటంతో ఆయన చీర్స్ చెప్పాడు. అదేంటి మైదనంలో క్రికెట్ అడుతున్న... Read more
May 27 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ యేటి సీజన్లో శిఖర్ ధావన్ సూపర్ షో కనబరిచాడు. అయినా తాను ప్రతినిథ్యం వహించిన పంజాబ్ కింగ్స్ జట్టు మాత్రం ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. శిఖర్ ధావన్... Read more