Rashid Khan pleads to not ‘leave them in chaos’ ‘‘నా దేశాన్ని రక్షించండీ’’: రషీద్ ఖాన్ వేడుకోలు

Don t leave us in chaos we want peace afghan cricketer appeals to world leaders

Afghanistan, Rashid Khan, Rashid Khan Twitter, Talibans Terrorists, Islamic terror group, American Troops, Global leaders, world leaders, United Nations, Cricketer, sports

As Islamic terror group Taliban takes control of several provincial capitals in Afghanistan, fuelling a massive humanitarian crisis, Afghanistan cricketer Rashid Khan took to Twitter on Tuesday to appeal for peace and requested the world leaders not to leave his countrymen in chaos.

‘‘శాంతి కామకులం.. వదిలేయకండీ’’: రషీద్ ఖాన్ వేడుకోలు

Posted: 08/11/2021 08:42 PM IST
Don t leave us in chaos we want peace afghan cricketer appeals to world leaders

ఆఫ్ఘ‌నిస్థాన్ నుంచి అమెరికా ద‌ళాలు వెన‌క్కి వెళ్తుండ‌టంతో మ‌రోసారి ఆ దేశం మెల్ల‌గా తాలిబ‌న్ల గుప్పిట్లోకి వెళ్తోంది. దేశంలోని ఒక్కో ప్రాంతాన్ని తాలిబ‌న్లు త‌మ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. దీంతో ఆఫ్ఘ‌న్ సైన్యం, తాలిబ‌న్ల మ‌ధ్య యుద్ధం అభంశుభం తెలియని సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను బ‌లి తీసుకుంటోంది. త‌మ దేశం రావ‌ణ‌కాష్టంగా మారుతుండ‌టాన్ని చూసి త‌ట్టుకోలేక‌పోతున్న స్టార్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్.. నానాటికీ భయాందోళనగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో తాజాగా ప్రపంచ దేశాలకు, నేతలకు సాయం కోరుతూ ట్వీట్ చేశాడు.

త‌మను ఇలా గంద‌ర‌గోళంలో వ‌దిలేయ‌కండి అని వేడుకుంటున్నాడు. అత‌డు ట్విట‌ర్ ద్వారా త‌న గోడు వెల్ల‌బోసుకున్నాడు. ప్ర‌పంచ నేత‌లారా! మా దేశం గంద‌ర‌గోళంగా ఉంది. పిల్ల‌లు, మ‌హిళ‌లు స‌హా వేల మంది ప్ర‌తి రోజూ మృత్యువాత ప‌డుతున్నారు. ఇళ్లు, ఆస్తుల విధ్వంసం జ‌రుగుతోంది. వేలాది కుటుంబాలు చెల్లాచెదుర‌య్యాయి. మ‌మ్మ‌ల్ని ఇలా గంద‌ర‌గోళంలో వ‌దిలేయ‌కండి. ఆఫ్ఘ‌న్ల హ‌త్య‌ల‌ను, ఆఫ్ఘనిస్థాన్ విధ్వంసాన్ని ఆపండి. మాకు శాంతి కావాలి అని ర‌షీద్ ఖాన్ ఎంతో ఆవేద‌న‌తో ట్వీట్ చేశాడు. ప్ర‌స్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లోని 65 శాతం భూభాగం మ‌ళ్లీ తాల‌బన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Afghanistan  Rashid Khan  Rashid Khan Twitter  Talibans  American Troops  Cricketer  sports  

Other Articles