Ishant Sharma gets stitches on his right hand గాయపడ్డ టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ

Ishant sharma sustains injury in wtc final against new zealand

ICC World Test Championship, WTC, Ishanth sharma, injury, fingers, Stiches, BCCI, Team India, New Zealand, sports, cricket news, sports news, Cricket

Senior India pacer Ishant Sharma has sustained an injury on his right hand during the World Test Championship (WTC) final against New Zealand at the Ageas Bowl in Southampton. Ishant Sharma had multiple stitches on his middle and fourth finger in his right hand. However, it is not very serious.

WTC final: గాయపడ్డ టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ

Posted: 06/25/2021 05:44 PM IST
Ishant sharma sustains injury in wtc final against new zealand

న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో భారత్ పై కివీస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో తన అద్భుత ప్రదర్శనను ఇచ్చిన టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ గాయపడ్డాడు. రెండో ఇన్నింగ్స్ లో తన బౌలింగ్ లో బ్యాట్స్ మెన్ కొట్టిన ఓ బంతిని ఆపేందుకు ఇషాంత్ డైవ్ చేశాడు. ఈ ప్రమాదంలో అతని కుడిచేతి మధ్య, ఉంగరపు వేళ్లకు గాయాలయ్యాయి.

వేలి నుంచి రక్తం రావడంతో వెంటనే అతన్ని మైదానం నుంచి తీసుకెళ్లిపోయారు. అనంతరం గాయపడిన వేలికి వైద్యులు కుట్లు వేశారు. దీనిపై బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ, ఇషాంత్ కు అయిన గాయం పెద్దదేమీ కాదని, పది రోజుల్లో కుట్లు మానిపోతాయని చెప్పారు. ఇంగ్లండ్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ కు ఇంకా ఆరు వారాల సమయం ఉందని... ఆలోగా అతను కోలుకుంటాడని తెలిపారు.

టెస్ట్ ఛాంపియన్ షిప్ ముగియడంతో టీమిండియా ఆటగాళ్లకు కావాల్సినంత విరామం దొరికిందని సదరు అధికారి తెలిపారు. నిన్న సాయంత్రమే ఆటగాళ్లందరూ సౌతాంప్టన్ నుంచి లండన్ కు చేరుకున్నారని చెప్పారు. 20 రోజుల వరకు బ్రిటన్ లో వారికి ఇష్టం వచ్చిన చోట విహరించవచ్చని తెలిపారు. వింబుల్డన్, యూరో గేమ్స్ ఇలా వారికి ఇష్టమైన చోటుకు వెళ్లొచ్చని తెలిపారు. జులై 14న అందరూ మళ్లీ లండన్ లో ఒకే చోటుకు చేరుకుంటారని చెప్పారు. ఆ తర్వాత లండన్ నుంచి తొలి టెస్టు జరిగే నాటింగ్ హామ్ కు చేరుకుంటారని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : World Test Championship  WTC  Ishanth sharma  injury  fingers  Stiches  BCCI  Team India  New Zealand  sports  Cricket  

Other Articles