అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేయగా, అందులో ఇంగ్లండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఏకంగా 25 మ్యాచులు అడిన ఇంగ్లాండ్ 6877 పాయింట్లతో 275 రేటింగ్ తో అగ్రస్థానంలో కోనసాగుతోంది. కాగా ఆ తరువాత స్థానంలో అస్ట్రేలియా 6800 పాయింట్లతో 272 రేటింగ్ తో ద్వితీయ స్థానంలో కొనసాగుతోంది. ఇక టాప్ త్రి స్థానంలో టీమిండియా కొనసాగుతోంది. 38 మ్యాచులు అడిన టీమిండియా 10,186 పాయింట్లతో వున్నా 268 రేటింగ్ తో తృతీయ స్థానానికి పరిమితం అయ్యింది.
ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా పాకిస్థాన్ 260 రేటింగ్ తో, ఆ తరువాత దక్షిణాఫ్రియా 251 రేటింగ్ తో నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఆ తరువాత న్యూజీలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, అప్ఘనిస్థాన్, వెస్టిండీస్ జట్టు కోనసాగుతున్నాయి. టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో భారత బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ ఒక స్థానం ఎగబాకి, రెండో స్థానానికి చేరుకున్నాడు. ఆయన ఖాతాలో 816 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఈ జాబితాలో ఇంగ్లండ్ క్రికెటర్ డేవిడ్ మలాన్ ( 915 రేటింగ్ పాయింట్లు) అగ్రస్థానంలో వున్నారు.
పరుగుల యంత్రంగా ఖ్యాతి గడించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏడో ర్యాంక్ లో ఉన్నాడు. ఈ ర్యాంకింగులో టాప్ బ్యాట్స్ మెన్ల జిబితాలో మరే ఇతర టీమిండియా బ్యాట్స్ మెన్ కు స్థానం లభించలేదు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘన్ ఆటగాడు రషీద్ ఖాన్ (736 పాయింట్లు) అగ్రస్థానంలో ఉండగా, సౌతాఫ్రికా ఆటగాడు షమ్సీ (733 రేటింగ్ పాయింట్లు) రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక బౌలర్ల విభాగంలో టీమిండియా నుంచి ఏ బౌలర్ కూడా ఈ జాబితాలో స్థానాన్ని అందుకోలేకపోయారు. అంతేకాదు అటు ఆల్ రౌండర్ జబితాలోనూ టీమిండియా ఆటగాళ్లు తమ స్థానాలను పధిలపర్చుకోలేదు.
(And get your daily news straight to your inbox)
Feb 27 | దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్ కు భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐదు వన్డేల సిరీస్‌కు కెప్టెన్ మిథాలీ రాజ్, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని సభ్యుల... Read more
Feb 27 | ఇంగ్లండ్‌తో జరుగనున్న కీలకమైన నాలుగో టెస్టుకు టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ ఫాస్ట్‌బౌలర్ అహ్మదాబాద్ టెస్టు నుంచి తప్పుకొన్నాడు. తనకు విశ్రాంతి కావాల్సిందిగా బుమ్రా భారత... Read more
Feb 16 | పర్యాటక జట్టు ఇంగ్లండ్ తో చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. పర్యాటక జట్టుపై ఏకంగా 317 పరుగుల భారీ తేడాతో నెగ్గిన టీమిండియా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్... Read more
Feb 16 | పర్యాటక జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓటమిని చవిచూసిన టీమిండియా జట్టు చెన్నైలో జరిగిన రెండో టెస్టులో ప్రతీకారం తీర్చుకుంది. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో పర్యాటక జట్టును కేవలం 56... Read more
Feb 09 | టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన తాజా ట్వీట్ ద్వారా తన అభిమానులతో పాటు టీమిండియా క్రికెట్ అభిమానులను కూడా అందోళనకు గురిచేస్తున్నాడు. ట్విటర్ వేదికగా రిలీజ్ చేసిన వీడియో.. టీమిండియా మాజీ... Read more