Warner ruled out of first India Test in Adelaide టెస్టు సిరీస్ కు ముందే అసీస్ కు షాక్..

David warner ruled out of first test against india joe burns plays day night warm up

David Warner, Warner injury, Warner ruled out, India v Australia, Ind vs Aus 1st test, Warner ruled out of 1st test, david warner ruled out, justin langer, sports, Cricket

Australia will be without their dynamic batsman David Warner for the first Test against India in Adelaide starting December 17 after it was confirmed that the star batsman will need 'another 10 days' to recover from the groin strain he sustained during the ODI series.

టెస్టు సిరీస్ కు ముందే అసీస్ కు షాక్.. కీలక ఆటగాడు లేకుండానే..

Posted: 12/10/2020 01:27 PM IST
David warner ruled out of first test against india joe burns plays day night warm up

టీమిండియాతో టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా జట్టు షాక్ తగిలింది. అసీస్ జట్టులో కీలకమైన ఓపెనర్ డేవిడ్ వార్నర్ జట్టుకు దూరం కానున్నాడు. తొడకండరాల గాయంతో టీమిండియాతో చివరి వన్డే, టీ20 సిరీస్ కు దూరమైన వార్నర్.. టెస్టు సిరీస్ కు కూడా దూరం కానున్నాడు. డిసెంబర్ 17 నుంచి టీమిండియా, ఆసీస్ జట్ట మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది. సిడ్నీ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్‌ చేస్తూ గాయాల బారిన పడిన వార్నర్ ఈ సిరీస్ కు అందుబాటులోకి వస్తాడని భావించిన క్రికెట్ అస్ట్రేలియా.. ఆయన తొలి టెస్టుకు అందుబాటులోకి రావడం కూడా అనుమానమేనన్న విషయాన్ని వెల్లడించింది.

అడిలైడ్ వేదికగా తొలి డే/నైట్ టెస్టుకు వార్నర్ దూరం కానున్నారు. గాయం కారణంగా వన్డే, టీ20 సిరీస్ ల నుంచి తప్పుకున్న ఆయన తాజాగా తొలి టెస్టుకు కూడా దూరం కానున్నారు. కాగా పూర్తి ఫిట్ నెస్ సాధించడానికి మరో పది రోజుల సమయం పడుతుందని వార్నర్‌ తెలిపాడు. అయితే మెల్ బోర్న్‌ వేదికగా జరిగే రెండో టెస్టుకు అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నాడు. వార్నర్ గాయం గురించి ఆస్ట్రేలియా జట్టు కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ మాట్లాడుతూ.. అతడు మెల్ బోర్న్‌ టెస్టుకు పూర్తిఫిట్ నెస్ సాధిస్తాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు. అయితే డే-నైట్ టెస్టుకు వార్నర్ దూరం కావడం అస్ట్రేలియా జట్టుకు షాకేనంటున్నారు క్రికెట్ అభిమానులు.

పింక్ బాట్ టెస్టులో ప్రతిభ కనబరుస్తున్న వార్నర్‌ తో పాటు ఆసీస్‌ యువ ఓపెనర్‌ విల్‌ పకోస్కీ కూడా కంకషన్‌కు గురికావడం ఆ జట్టు‌ను కలవరపెడుతోంది. ప్రాక్టీస్ మ్యాచ్ లో కార్తీక్‌ త్యాగి విసిరిన బౌన్సర్‌ అతడి హెల్మెట్ కు తాకింది. అతడిలో కంకషన్‌ లక్షణాలు స్వల్పంగా కనిపించడంతో డిసెంబర్‌ 11 నుంచి జరిగే రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్ కు దూరమయ్యాడు. ఓ వైపు పింక్ బాల్ తో బౌలర్ల అధిపత్యాన్ని చిధ్రం చేసి.. బౌండరీలను సునాయాసంగా బాదే అనుభవశాలి వార్నర్ జట్టుకు దూరం కావడం ఆస్ట్రేలియాకు ప్రతికూలాంశమే. చివరి వన్డే.. తొలిరెండు టీ20లలో వార్నరత్ లేని లోటు స్పష్టంగా కనిపించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles