Harbhajan Singh Shocked By Electricity Bill హర్జన్ సింగ్ కు షాక్ ఇచ్చిన విద్యుత్ బిల్లు..

Harbhajan singh shocked by electricity bill questions adani power

Harbhajan Singh, Adani Power, Adani electricity, electricity bill, chennai super kings, cricket news, sports news, Sports, Cricket

Veteran Indian cricket team bowler Harbhajan Singh expressed shock over receiving an electricity bill for Rs 33,900. He voiced his feelings on Twitter, even tagging Adani Electricity in his tweet. The former spinner asked Adani Electricity if they incorrectly gave him a collective bill for every house in the neighbourhood.

హర్జన్ సింగ్ కు షాక్ ఇచ్చిన విద్యుత్ బిల్లు.. వీధి మొత్తానిదా.?

Posted: 07/28/2020 10:37 PM IST
Harbhajan singh shocked by electricity bill questions adani power

సర్వసాధారణంగా సెలబ్రిటీల ఇళ్లకు వచ్చే విద్యుత్ బిల్లు ఎక్కువగానే వుంటుంది. అయితే ఈ బిల్లు మొత్తాలను చూసిచూడనట్టుగానే వారు కట్టేస్తుంటారు. కానీ టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌, స్పిన్ మాంత్రికుడు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ఎందుకో తన ఇంటికి వచ్చిన విద్యుత్ బిల్లును చూసి షాక్ అయ్యాడు. ఎంతలా అంటే ఏకంగా తనకు బిల్లును అందించిన వాడు తనది మాత్రమే కాకుండా తన వీధికి సంబంధించిన అందరి విద్యుత్ బిల్లులను తనకే ఇచ్చాడని అనేంతగా. ఎందుకలాగా అంటే.. తనకొచ్చిన కరెంటు బిల్లు చూసి ఆయనకు అలాంటి అనుభవాన్ని మిగిల్చింది.

సహజంగా తాను కట్టేదాని కన్నా ఏడింతలు ఎక్కువ వచ్చిందని చెప్పాడు. ముంబయి ఆదాని ఎలక్ట్రిసిటీ సంస్థ నుంచి ఇటీవల తనకు వచ్చిన మెసేజ్‌ను భజ్జీ ట్విటర్లో పోస్టు చేశాడు. అందులో చుట్టుపక్కల వాళ్లందరి బిల్లు కూడా తనకే ఇచ్చారా అంటూ ఆ సంస్థను నిలదీశాడు. ఈ నెల మొత్తం రూ.33,900 బాకీ ఉన్నట్లు తనకు వచ్చిన మెసేజ్‌ను చూపించాడు. కాగా, ఇటీవలి కాలంలో ఇలా కరెంట్‌ బిల్లులు అధికమొత్తంలో రావడం సాధారణం అయిపోయింది. ఇంతకుముందు బాలీవుడ్‌ నటి తాప్సీ సైతం తనకు రూ.36 వేలు వచ్చిందని, ఇప్పుడా ఇంట్లో ఎవరూ ఉండరని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles