Tendulkar's knock higher than Sehwag's 309: Saqlain 'వీరూ ట్రిపుల్ సెంచరీ కన్నా టెండుల్కర్ శతకం మిన్నా'

Tendulkars knock in chennai higher than sehwags 309 saqlain mushtaq

Saqlain Mushtaq, Virender Sehwag, Sachin Tendulkar, sports news, cricket news, todays cricket score, cricket match, sports, cricket

Pakistan spin great Saqlain Mushtaq said that he rates Sachin Tendulkar's 136 during the 1999 Chennai Test higher than Virender Sehwag's 309 in Multan 2004. Saqlain, who was involved in both matches, said that Tendulkar's knock came against a Pakistan team that was well prepared and battling to win the match whereas Sehwag's Multan knock came on a first day pitch.

‘‘వీరూ ట్రిపుల్ సెంచరీ కన్నా టెండుల్కర్ శతకం మిన్నా’’

Posted: 07/12/2020 07:10 AM IST
Tendulkars knock in chennai higher than sehwags 309 saqlain mushtaq

భారత జట్టులో అటు టెస్టు కానీ ఇటు పరిమిత ఓవర్లు మ్యాచుల్లో కానీ సచిన్ టెండుల్కర్ అనగానే క్రికెట్ దేవుడిగా కోలిచేవారి సంఖ్య అధికం. ఇక మాజీ ఇండియన్ టీమ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వినగానే ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెటలు పట్టేవి. అవతలి వైపు ఎంతటి గోప్ప బౌలర్ వున్నా.. బంతులను అవలీలగా బౌండరీలకు తరలించే సమర్థుడు వీరూ. వీరిద్దరూ భారతీయ క్రికెట్ లో అణిముత్యాలే. అయితే సెహ్వాగ్ భారత జట్టు తరపున ట్రిపుల్ సెంచరీ చేసిన మొదటి ఆటగాడు. కానీ సెహ్వాగ్ 300 కంటే సచిన్ 100 బెస్ట్ అంటున్నాడు పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సక్లైన్ ముష్తాక్.

సెహ్వాగ్ తన మొదటి ట్రిపుల్ సెంచరీ పాకిస్థాన్ పై 2004 చేసాడు. అదీనూ ధాయాధి గడ్డపైనే ముల్లాన్ లోనే ఈ అరుదైన ఫీటు చేశాడు. అయితే దీన్ని కంటే సచిన్ తమ పై 1999 చెన్నైలో చేసిన 136 పరుగులు అత్యుత్తమ అంటున్నాడు ముష్తాక్. 1999 చెన్నై టెస్ట్ మరియు 2004 ముల్తాన్ టెస్ట్ రెండింటిలోనూ పాకిస్తాన్ జట్టులో సక్లైన్ ముష్తాక్ ఉన్నాడు. ‘‘1999 లో మేము భారత పర్యటనకు అని రకాలుగా సిద్ధమై వెళ్ళాము. అప్పుడు జరిగిన మ్యాచ్ ఓ యుద్ధంల జరిగింది’’ అని చెప్పాడు.

అయితే భారతదేశానికి వ్యతిరేకంగా ఆడిన 2004 సిరీస్ లో టీమిండియా తమ దేశానికి అతిధ్యంగా వచ్చిందన్నాడు, అప్పుడు తమకు సరైన ప్రణాళిక కూడా లేదని, ఇక సన్నాహాలు లేవని అన్నాడు. అందువల్ల సెహ్వాగ్ చాలా విధ్వంసక దాడి చేసే పాకిస్థాన్ పై ఏకంగా 300 పరుగులు సాధించాడని అన్నాడు. అయితే తాను మాత్రం ఆ ట్రిపుల్ సెంచరీని బెస్ట్ అనుకోను అన్నాడు. అయితే వీరూ చాలా మంచి నాక్స్ ఆడాడని తెలిపాడు. దీంతో నెట్ జనులు సక్లైన్ ముస్తాక్ ను నెట్టింట్లో ఉతికి అరేస్తున్నారు. సక్లైన్ ముస్తాక్ తమ దేశ ఆటగాళ్లు, వాళ్లు చేసిన ఫీట్ల గురించి కాకుండా పాకిస్థాన్ గురించి మాట్టాడితే బాగుంటుందని ట్రోల్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saqlain Mushtaq  Virender Sehwag  Sachin Tendulkar  sports  cricket  

Other Articles