Chahal se opening karwa le: Chahal tells Anushka in reply వదినా.. అంటూనే అనుష్కపై సరదా కామెంట్స్ చేసిన చాహల్

Yuzvendra chahal s cheeky reply for anushka sharma nagging virat kohli

Virat Kohli anushka shrama, virat kohli anushka sharma instagram video, anushka sharma cheering virat, yucvendra chahal batting, yuzvendra chahal opnener, yuzvendra chahal instagram, cricket score, cricket news, Cricket, sports

India spinner Yuzvendra Chahal is all over the internet these days and he can be seen either posting his own pictures and videos or commenting on the posts of other cricketers. Chahal in his 'quest' to become a social media star amid the coronavirus lckdown period

వదినా.. అంటూనే అనుష్కపై సరదా కామెంట్స్ చేసిన చాహల్

Posted: 04/18/2020 07:50 PM IST
Yuzvendra chahal s cheeky reply for anushka sharma nagging virat kohli

లాక్ డౌన్‌ వేళ ఇంటికే పరిమితమైన టీమిండియా క్రికెటర్లు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నారు. అభిమానులకు కరోనాపై అవగాహన కల్పిస్తూనే అప్పుడప్పుడు సరదా పోస్టులతో అలరిస్తున్నారు. టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఆయన సతీమణి అనుష్కశర్మ సైతం లాక్‌డౌన్‌ వేళ సరదా పోస్టులతో ఆకట్టుకుంటున్నారు. ఇటీవల కోహ్లీ జుత్తు కత్తిరించిన అనుష్క తాజాగా అతడిని ఓ అభిమానిలా ఆట పట్టించింది.

మైదానంలో అభిమానులు కోహ్లీని ఎలా ఆడాలని అడుగుతారో తెలిసేలా అనుష్క ఓ హాస్యాస్పద వీడియో రూపొందించింది. ‘కోహ్లీ.. ఓయ్‌ కోహ్లీ.. ఫోర్‌ కొట్టూ.. ఫోర్‌!’ అంటూ అరుస్తూ ఆటపట్టించింది. దానికి విరాట్‌ ఓ లుక్కేసి వదిలేశాడు. ఈ వీడియో చూసిన యుజువేంద్ర చాహల్‌ వెంటనే సరదాగా స్పందించాడు. ‘వదినా.. తర్వాతి వీడియోలో నన్ను ఓపెనర్‌గా పంపాలని చెప్పండి. కోహ్లీ మీ మాట వింటాడని ఆశిస్తున్నా’ అంటూ సరదా వ్యాఖ్యలు చేశాడు. గతంలో చాహల్‌.. అనుష్కను ఉద్దేశించి చాలాసార్లు సరదా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. కోహ్లీకి జుత్తు కత్తిరించిన వీడియోలో.. అనుష్క కత్తెరతో కాకుండా ట్రిమ్మర్‌ ఉపయోగించి కోహ్లీ గడ్డాన్ని కత్తిరించాలని జోక్‌ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  anushka shrama  instagram video  yucvendra chahal  opener  instagram  Cricket  sports  

Other Articles