India batsman Suresh Raina questions BCCI selectors ధోనికి వయసు పైబడలేదు.. ఇంకా క్రికెట్ దాగివుంది: రైనా

No signs of ageing ms dhoni still has cricket left in him suresh raina

Suresh Raina, MS Dhoni, Chennai Super Kings (CSK), COVID-19 pandemic, Indian Premier League (IPL), Instagram, Sourav Ganguly, cricket score, cricket news, Cricket, sports

Veteran India batsman Suresh Raina said MS Dhoni was trying to innovate a lot while batting during the Chennai Super Kings (CSK) camp which got cancelled midway due to the COVID-19 pandemic.

ధోనికి వయసు పైబడలేదు.. ఇంకా క్రికెట్ దాగివుంది: రైనా

Posted: 04/15/2020 07:34 PM IST
No signs of ageing ms dhoni still has cricket left in him suresh raina

టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీకి ఇంకా వయసు అయిపోలేదని, ఇంకొంత కాలం అద్భుతంగా క్రికెట్‌ ఆడగలడని భారత సీనియన్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా అన్నాడు. ‘‘ధోనీ గొప్పగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. అతడికి ఇంకా ఎంతో క్రికెట్ మిగిలుంది. మేం ప్రాక్టీస్‌ గేమ్స్‌లో భారీ సిక్సర్లు బాదాం. వేడి ఎక్కువగా ఉండే చెన్నైలో సాయంత్రం మూడు గంటల పాటు బ్యాటింగ్‌ చేశాం. ఇంకా వయసు అయిపోలేదని అతడి శరీరం చెబుతోంది. మైదానంలో మీరు కొత్త ధోనీని చూస్తారు’’ అని రైనా తెలిపాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ధోనీ, రైనా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

తాను దశాబ్దమున్నర కాలంగా క్రికెట్‌ ఆడుతున్నానని, తన ఆటలో పొరపాట్లు ఉంటే సారథిగా ధోనీ, దాదా తెలిపేవారని అన్నాడు. రిషభ్‌ పంత్‌కు ఎంతో నైపుణ్యం ఉందని అతడికి అండగా నిలవాలని వ్యాఖ్యానించాడు. ‘‘పంత్‌ ఎంతో ప్రతిభావంతుడు. అతడికి ఎవరైనా అండగా నిలవాలి. నేను ఆడిన తొలి రోజుల్లో యువరాజ్‌ సింగ్‌ నాకు మద్దతు ఇచ్చాడు. నువ్వు చేసిన పొరపాట్లని మేం సరిదిద్దుతామని తెలిపాడు. అలాగే పంత్‌కు కూడా ఎవరైనా ధైర్యాన్ని ఇవ్వాలి. విదేశాల్లో అతడు శతకాలు సాధించాడు. అతడు అదృష్టంతో రాణించే ప్లేయర్‌ కాదు. అయితే అతడు ఆత్మవిశ్వాసంతో లేడని అనిపిస్తుంది’’ అని రైనా వెల్లడించాడు. సెహ్వాగ్‌, సచిన్, ద్రవిడ్ సోదరులుగా క్రికెట్‌తో పాటు ఇతర విషయాల్లో కూడా సూచనలు ఇచ్చారని అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles