కరోనా వైరస్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరును మలిదశకు తీసుకువెళ్లేందుకు ఒక్కొక్కరుగా ప్రముఖులు కూడా కదులుతున్నారు. ఇప్పటికే సినీపరిశ్రమకు చెందిన ప్రముఖులు తమ వంతుసాయంగా విరాళాలను అందజేస్తుండగా, అదే బాటలో క్రీడా ప్రముఖులు కూడా కదులుతున్నారు. గొప్ప వ్యక్తులు గోప్ప ఆటలతోనో, క్రీడాస్పూర్తితోనే కాదు.. గోప్ప మనస్సుతోనూ అవుతారని నిత్యం చాటే మన దేశ క్రీడా ప్రముఖులు చాలా మటుకు గుప్తదానాలకే ప్రాధాన్యతను ఇస్తుంటారు.
ప్రస్తుతం దేశంలోని అనేక మంది పేద, బీద, బిక్కి ప్రజలకు తమ వంతు సాయంగా కూడా ఇప్పటికే ప్రముఖులు గోప్యంగా దానాలు చుస్తున్నారు. అయితే బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాత్రం ధన సాయం కాకుండా.. దేశం ఎదుర్కోంటున్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో తన వంతుగా ప్రభుత్వ పాఠశాలలో రక్షణ పోందుతున్న అన్నార్తులకు యాభై లక్షల రూపాయల బియ్యాన్ని అందజేస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి ఆయన లాల్ బాబా రైస్ అనే సంస్థతో కలసి సంయుక్తంగా చేస్తున్నారు.
ఇక మన తెలుగు తేజం.. పీవీ సింధూ కూడా తెలుగు ప్రజలకు సాయాన్ని అందించింది. ఇందులో భాగంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధిలో మన ప్రపంచ ఛాంపియన్ రూ.5లక్షలు చొప్పున విరాళంగా ప్రకటించింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ట్వీట్ చేసింది. ఈ ప్రమాదకర వైరస్ వ్యాప్తి చెందకుండా భారత్‌లో ప్రస్తుతం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దేశం మొత్తం లాక్‌డౌన్ చేయడంతో సురక్షితులుగా వుండాలంటూ ఇళ్లలోనే వుండండీ అంటూ ట్వీట్ చేసింది. ప్రభుత్వం పిలుపుకు అందరూ సహకరించాలని.. మన కోసం ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి ఇంట్లో వుండి మద్దతు ప్రకటించాలని పేర్కోంది.
(And get your daily news straight to your inbox)
Mar 18 | సూర్యకుమార్ యాదవ్ కల ఎట్టకేలకు సాకరమైంది. టీమిండియా తరఫున ఆడాలన్న అతడి నిరీక్షణకు తెరపడి, ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టీ20లో బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ఈ... Read more
Feb 27 | దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్ కు భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐదు వన్డేల సిరీస్‌కు కెప్టెన్ మిథాలీ రాజ్, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని సభ్యుల... Read more
Feb 27 | ఇంగ్లండ్‌తో జరుగనున్న కీలకమైన నాలుగో టెస్టుకు టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఈ ఫాస్ట్‌బౌలర్ అహ్మదాబాద్ టెస్టు నుంచి తప్పుకొన్నాడు. తనకు విశ్రాంతి కావాల్సిందిగా బుమ్రా భారత... Read more
Feb 16 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేయగా, అందులో ఇంగ్లండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఏకంగా 25 మ్యాచులు అడిన ఇంగ్లాండ్ 6877 పాయింట్లతో 275 రేటింగ్ తో అగ్రస్థానంలో కోనసాగుతోంది. కాగా... Read more
Feb 16 | పర్యాటక జట్టు ఇంగ్లండ్ తో చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘనవిజయం సాధించింది. పర్యాటక జట్టుపై ఏకంగా 317 పరుగుల భారీ తేడాతో నెగ్గిన టీమిండియా ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్... Read more