India take on Australia in T20 World Cup finals వరల్డ్ కప్ ఫైనల్ లో టీమిండియా ప్రత్యర్థి అసీస్.!

Icc women s t20 world cup team india enter maiden t20 women s world cup final

icc womens t20 world cup, india women cricket team, Australia women cricket team, india women vs Australia women, indw vs Ausw, Ausw vs indw, ind w vs aus w, shafali verma, radha yadav, ICC Womens T20 World Cup finals, T20 world cup 2020 finals, India vs Australia final, cricket results, cricket news, cricket news live, Cricket, Sports, sports news, cricket news, latest cricket news

Team India entering their maiden final of the ICC Women's T20 World Cup 2020. India qualifies for the final and plays the finals with Australia.

మహిళల టీ-20 వరల్డ్ కప్ ఫైనల్: ఇండియా వర్సెస్ అసీస్..

Posted: 03/05/2020 07:58 PM IST
Icc women s t20 world cup team india enter maiden t20 women s world cup final

ఐసీసీ మహిళా టీ-20 వరల్డ్ కప్ పోటీలలో టీమిండియా మహిళల జట్టు జైత్రయాత్ర టైటిల్ కైవసానికి మరో అడుగు దూరంలో వుంది. సెమీస్ అడిన ఇద్దరిలో భారత్ ప్రత్యర్థి వెవరన్న విషయం తేటతెల్లం అయ్యింది. వరల్డ్ కప్ ప్రారంభంలోనే తొలి మ్యాచ్ ఆడిన జట్లే తుది సమరానికి సమాయత్తం కానున్నాయి. టీమిండియా ప్రత్యర్థి ఢిపెండింగ్ ఛాంపియన్ అస్ట్రేలియా అన్న విషయం ఇవాళ జరిగిన రెండో సెమిఫైనల్ లో తెలిసిపోయింది. దక్షిణాఫ్రికాను డక్ వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 5 పరుగుల తేడాతో ఓడించి వరుసగా ఆరో సారి మెగాటోర్నీ ఫైనల్‌ చేరుకుంది.

వర్షం కారణంగా మ్యాచ్‌ ఆలస్యంగా ఆరంభమైంది. టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా ఆతిథ్య ఆస్ట్రేలియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (49*; 49 బంతుల్లో 4×4, 1×6)కు తోడుగా బెత్‌ మూనీ (28; 24 బంతుల్లో 4×4), అలీసా హేలీ (18; 13 బంతుల్లో 4×4), రేచెల్‌ హేన్స్‌ (17; 18 బంతుల్లో) రాణించడంతో ఆసీస్‌ 134/5 పరుగులు చేసింది. నదీన్‌ డి క్లెర్క్‌ 3 వికెట్లు తీసింది. ఛేదనలో వరుణుడు మరోసారి అంతరాయం సృష్టించడంతో సఫారీల లక్ష్యం 13 ఓవర్లకు 98గా నిర్ణయించారు.

ఓపెనర్లు లిజెల్‌ లీ (10), నీకెర్క్‌ (12) విఫలం కావడంతో 5 ఓవర్లకే 24/3తో కష్టాల్లో పడ్డ ఆ  జట్టును సున్‌ లూ (21; 22 బంతుల్లో 2×4), లారా వోల్వార్డ్‌ (41*; 27 బంతుల్లో 3×4, 2×6) గెలిపించేందుకు శక్తి వంచన లేకుండా శ్రమించారు. కానీ ఉత్కంఠతో ఊపేసే భారీ మ్యాచులు గెలిచిన అనుభవంతో కంగారూలు పైచేయి సాధించారు. ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికా 19 పరుగులు చేయాల్సి ఉండగా జెస్‌ జొనాసెన్‌ తొలి బంతికి వికెట్‌ తీసి 13 పరుగులే ఇచ్చింది. లీగ్‌ దశలో వరుస విజయాలు సాధించిన సఫారీలు ఎంతో నిరాశకు భావోద్వేగానికి గురై కన్నీటితో మైదానం వీడారు. దీంతో ఫైనల్ లో అసీస్ తో భారత్ తలపడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles