Virat Kohli savagely trolls bowler after insane shot విలియమ్స్ పై విరాట్ కోహ్లీ బదులు తీర్చుకున్నాడోచ్..!

Virat kohli ticks off kesrick williams to unleash his inner pant

Kesrick Williams Notebook Celebration, Virat Kohli Notebook Celebration, Virat Kohli, Kesrick Williams, Notebook Celebration, India vs WestIndies, Uppal stadium, Hyderbad, cricket news, sports news, cricket news, sports news, cricket, sports

India captain Virat Kohli prefers his bat to do all the talking. But in a rare incident during the opening Twenty20 International against the West Indies in Hyderabad on Friday, he turned his arm into a virtual 'notebook' to celebrate.

విలియమ్స్ పై విరాట్ కోహ్లీ బదులు తీర్చుకున్నాడోచ్..!

Posted: 12/07/2019 06:43 PM IST
Virat kohli ticks off kesrick williams to unleash his inner pant

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఉప్పల్ స్టేడియం వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఓ అరుదైన సంఘటనతో మరోసారి వార్తల్లోకెక్కాడు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్లో ప్రత్యర్థి ఆటగాడు విలియమ్స్ ను ఉద్దేశించి కోహ్లి తన చేతిని 'నోట్‌బుక్'గా మార్చి.. టిక్‌ కొడుతున్నట్లు చేసిన విన్యాసం సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో ఓ మ్యాచ్‌ సందర్భంగా తన వికెట్‌ తీసి సంబరాలు చేసుకున్న విలియమ్స్ కు అదే రీతిలో కౌంటర్ ఇచ్చాడంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.

ఇక 208 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు 50 బంతుల్లో 94 పరుగులు చేసిన కోహ్లీ.. 54 పరుగుల వద్ద కొనసాగుతున్న సమయంలో విలియమ్స్‌ 16వ ఓవర్లో రెండో బంతిని అతని తలపై నుంచి నేరుగా బౌండరీకి తరలించాడు. ఆ తర్వాతి బంతిని లాంగాన్ లో కళ్లు చెదిరే సిక్సర్‌ గా మలిచాడు. సిక్స‌ర్ కొట్టిన త‌ర్వాత కోహ్లి అదే నోట్ బుక్‌ స్ట‌యిల్ లో ఆ మూమెంట్ ను ఎంజాయ్ చేశాడు. జేబులో నుంచి నోట్‌బుక్‌ను తీసి మూడు సార్లు టిక్కులు కొడుతున్నట్లు సెలబ్రేషన్ చేసుకున్నాడు.

మ్యాచ్‌ అనంతరం దీనిపై విరాట్‌ మాట్లాడుతూ.. గత వెస్టిండీస్‌ పర్యటనలో తనని ఔట్‌ చేసినపుడు విలియమ్స్‌ చేసిన సెలబ్రేషన్స్‌ ని దృష్టిలో పెట్టుకొని ఇలా బదులిచ్చినట్లు వ్యాఖ్యానించాడు. కాగా ఈ మ్యాచ్లో కోహ్లి 50 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 94 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. టీ20ల్లో కోహ్లీకి ఇది 23వ హాఫ్ సెంచరీ. తొలి టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో టీమిండియా మూడు టి20ల సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles