India were also winning in 70s and 80s: Gavaskar విరాట్ కోహ్లీ వ్యాఖ్యలపై సన్నీ ఘాటు సమాధానం..

India were winning before in 70s and 80s gavaskar reminds kohli

virat kohli, Sunil Gavaskar, sourav ganguly, india national cricket team, ind vs ban, Eden Gardens, Board of Control for Cricket in India, Bangladesh national cricket team, India vs Bangladesh series, Cricket news, sports news, Cricket, sports

Former India captain Sunil Gavaskar doesn't seem to be too impressed with current skipper Virat Kohli crediting Sourav Ganguly for starting the process that has now resulted in India asserting themselves on the cricket field and getting inside the minds of the opposition.

విరాట్ వ్యాఖ్యలపై ఘాటుగా సన్నీ సమాధానం..

Posted: 11/25/2019 06:59 PM IST
India were winning before in 70s and 80s gavaskar reminds kohli

బంగ్లాదేశ్ పై క్లీన్ స్వీప్ సాధించాక భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్న మాటలపై లెజెండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. 2000 నుంచి క్రికెట్‌లో భారత్ ఆధిపత్యం కనబర్చడం ప్రారంభమైందని, ఇప్పుడు దానిని తాము కొనసాగిస్తున్నామని మ్యాచ్ అనంతరం కోహ్లీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. బీసీసీఐ ప్రస్తుత చీఫ్ సౌరవ్ గంగూలీ అప్పట్లో టీమ్‌ను నడిపించిన సంగతి విదితమే. ప్రస్తుతం భారత బౌలింగ్ భీకరంగా తయారైందని, ప్రత్యర్థి ఎవరైనా ఇండియా బౌలర్లు అద్భుతంగా ఆడుతున్నారని ప్రశంసించాడు.

గత మూడు, నాలుగేళ్లుగా పడిన కష్టానికి ఇప్పుడు ఫలితం వస్తోందని కోహ్లీ వ్యాఖ్యానించాడు. అయితే మ్యాచ్ ముగిశాక జరిగిన ఓ టీవీ షోలో దీనిపై గావస్కర్ కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుత టీమిండియా సాధిస్తున్న విజయాలపై చాలా ఆనందంగా ఉందని అన్నాడు. ‘అయితే, గంగూలీ కెప్టెన్‌గా ఉన్నప్పటి నుంచే టీమిండియా ఆధిపత్యం కనబరుస్తుందని కోహ్లీ అన్నాడు.

గంగూలీని పొగిడే క్రమంలో కోహ్లీ అలా మాట్లాడి ఉండవచ్చు. అయితే 70, 80వ దశకాల్లోనే ఇండియా విదేశాల్లో అనేక విజయాలు సాధించింది. అప్పటికింకా కోహ్లీ పుట్టలేదు‘ అని చురకలు అంటించాడు. నిజానికి కొంతమంది 2000వ సంవత్సరం తర్వాతే క్రికెట్ ప్రారంభమయ్యిందని భావిస్తున్నారని వ్యంగ్యంగా మాట్లాడాడు. 70వ దశకంలోనే విదేశాల్లో భారత్ గెలుపొందిందని అన్నాడు. 1986లో విదేశీగడ్డపై సిరీస్ సాధించామని, అనేక సిరీస్‌లను డ్రాగా ముగించామని గావస్కర్ గుర్తు చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  Sunil Gavaskar  sourav ganguly  India vs Bangladesh series  Cricket  Sports  

Other Articles