Ind vs SA: Kohli fifty leads India to comprehensive win రెండో టీ20లో టీమిండియా విజయం..

India beat south africa by 7 wickets to take an unassailable 1 0 lead

Cricket, India Vs South Africa, India vs South Africa T20 series, India's tour of South Africa, T20 Cricket, South Africa vs India 2019, Virat Kohli, South Africa cricket team, Khaya Zondo, Indian cricket team, Cricket news, Sports news, latest news, sports, cricket

Skipper Virat Kohli produced a batting masterclass as India defeated South Africa by seven wickets in the 2nd T20I in Mohali to go 1-0 up in the three-match series.

విరాట్ అర్థశతకం.. రెండో టీ20లో టీమిండియా విజయం

Posted: 09/19/2019 10:19 AM IST
India beat south africa by 7 wickets to take an unassailable 1 0 lead

సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. మొహాలీ వేదికగా జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 150 పరగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 151 పపరుగులు చేసి విజయం సాధించింది. కెప్టెన్ కోహ్లీ 52 బంతుల్లో 72 నాటౌట్‌(4ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణంచగా... ఓపెనర్ ధావన్‌(40; 31 బంతుల్లో 4ఫోర్లు, 1 సిక్సర్‌) ఫరవాలేదనిపించాడు.

లక్ష్య చేధనలో టీమిండియాకు మంచి శుభారంభం లభించింది. తొలి వికెట్‌కు 33 పరుగులు జోడించిన అనంతరం రోహిత్‌(12)ను ఫెలుక్‌వాయో బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ నడిపించాడు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని నడిపించారు. ఈ క్రమంలో రెండో వికెట్‌కు వీరిద్దరూ కలిసి 61 పరుగులు జోడించారు. షంసీ బౌలింగ్‌లో ధావన్ బౌండరీ వద్ద డేవిడ్ మిల్లర్‌‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ధావన్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్‌ మరోసారి నిరాశపరిచాడు. ఫార్చూన్ బౌలింగ్‌లో పంత్‌(4) పేలవమైన షాట్‌ ఆడి వెనదిరిగాడు. శ్రేయాస్‌ అయ్యర్‌(16 నాటౌట్‌)తో కలిసి కోహ్లీ టీమిండియాకు విజయాన్ని అందించాడు. సఫారీ బౌలర్లలో ఫెలుక్‌వాయో, ఫార్చూన్, షమ్సీలు తలో వికెట్‌ దక్కించుకున్నారు. కోహ్లీకి మ్యాన్ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India Vs South Africa  T20 Cricket  south africa  Team India  Virat Kohli  cricket  

Other Articles