Pant aims for fresh start in South Africa series వైఫల్యాలను అధిగమిస్తూ.. ఆటపైనే దృష్టి: రిషబ్ పంత్

Focussing on my game looking to improve everyday rishabh pant

virat kohli,shubman gill,Rohit Sharma,kl rahul,India vs South Africa,india test squad for south africa,india squad for south africa tour 2019,india national cricket team,ind vs sa squad 2019 schedule,Cheteshwar Pujara, Sports news, cricket news, cricket, sports

Indian wicketkeeper-batsman Rishabh Pant said he is eyeing a fresh start with the upcoming T20 and Test series against South Africa after drawing criticism for a below-par show in the tour of West Indies last month.

వైఫల్యాలను అధిగమిస్తూ.. ఆటపైనే దృష్టి: రిషబ్ పంత్

Posted: 09/12/2019 03:39 PM IST
Focussing on my game looking to improve everyday rishabh pant

దక్షిణాఫ్రికా సిరీస్‌ను సరికొత్త దృక్పథంతో ఆరంభిస్తానని టీమిండియా యువవికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ అన్నాడు. ఈ సిరీస్‌ కోసం కఠినంగా సాధన చేశానని వెల్లడించాడు. వెస్టిండీస్‌ పర్యటనలో అంచనాల మేరకు రాణించకపోవడంతో అతడిపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాలో శతకాలు చేసిన భారత మొదటి కీపర్‌గా రికార్డులు సృష్టించిన పంత్‌ విండీస్‌పై రెండు టెస్టుల్లో కలిపి 58 పరుగులే చేశాడు. టీ20ల్లో చెత్త షాట్లకు ఔటయ్యాడు.

దక్షిణాఫ్రికా సిరీస్‌ కోసం కఠినంగా శ్రమించానని పంత్ తెలిపాడు. వైఫల్యాలను అధిగమించి సానుకూల దృక్పథంతో ముందుకెళ్తానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశాడు. సాధ్యమైనంత మేరకు శుభారంభం చేస్తానన్నారు. విండీస్ పర్యటనలో జట్టు అద్భుతంగా రాణించింది. అన్ని సిరీస్‌లను క్లీన్‌స్వీప్‌ చేసి రావడం గొప్ప విషయం. ఒక్కసారి జట్టు అక్కడ్నుంచి తిరిగొచ్చాక గతం గతః అన్నట్టే. తర్వాతి సిరీస్‌పై దృష్టిపెడతామన్నాడు పంత్.

ఇక సౌతాఫ్రికాతో సిరీస్ సొంతగడ్డపై ఆడుతున్నాం కాబట్టి కొంత అనుకూలత ఉంటుందని కూడా అభిప్రాయపడ్డాడు. ఏదేమైనప్పటికీ శుభారంభం చేయడం కీలకమనిజ.. టీమిండియా గెలుపునకు సాయపడాలని తాను కోరుకుంటానని చెప్పాడు. సఫారీలపై రాణించడమే తన ముందున్న లక్ష్యమన్నాడు. ధోనీని తానెంతో ప్రేమిస్తానని,..  ఇతరులు మమ్మల్ని పోల్చడాన్ని పట్టించుకోనని అన్నారు. మరింత మెరుగవ్వడం, చక్కగా ఆడటంపై దృష్టిసారిస్తానని పంత్‌ అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles