భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ గారాలపట్టి జివా ప్రస్తుతం ప్రపంచ కప్ మ్యాచులను ఆస్వాదిస్తోంది. ‘కమాన్ పాపా’ అంటూ గ్యాలరీ నుంచి తండ్రిని ఉత్సాహపరుస్తోంది. ఆదివారం మాంచెస్టర్ వేదికగా జరిగిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లోనూ జివా తన అల్లరితో అందరినీ ఆకట్టుకుంది. అయితే, ఈసారి ఈ అల్లరి పిల్లకు రిషబ్ పంత్ తోడయ్యాడు. ఎడమచేయి బొటనవేలు గాయంతో జట్టు నుంచి వైదొలిగిన శిఖర్ ధావన్ స్థానంలో బ్యాకప్ ప్లేయర్ గా రిషబ్ పంత్ ను బీసీసీఐ ఇంగ్లండ్‌కు పంపిన సంగతి తెలిసిందే.
అయితే, భారత్-పాక్ మ్యాచ్‌కు తుది జట్టులో పంత్‌కు స్థానం దక్కలేదు. దీంతో అతను వీఐపీ గ్యాలరీలో కూర్చొని మ్యాచ్‌ను వీక్షించాడు. మ్యాచ్ సమయంలో ధోనీ కూతురు జివాతో కలిసి అరుపులు, కేకలతో గోలగోల చేశాడు. తనతో జివా పోటాపోటీగా అరుస్తున్న వీడియోను పంత్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘పార్ట్నర్స్ ఇన్ క్రైమ్’ అని క్యాప్షన్ కూడా పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 15 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాదు, రిషబ్ పంత్‌ను ఇలా చూసిన నెటిజన్లు ‘బెస్ట్ బేబీసిట్టర్’ అంటూ కితాబిస్తున్నారు.
ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ సమయంలో రిషబ్ పంత్‌ను ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ స్లెడ్జింగ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెస్తున్నారు. ‘వన్డే టీమ్‌లోకి ధోనీ వచ్చాడు.. మరి నువ్వేం చేస్తావ్.. నా ఇంట్లో బేబీ సిట్టింగ్ చేస్తావా’ అంటూ పంత్‌ను టిమ్ పైన్ రెచ్చగొట్టాడు. ఆ తర్వాత పైన్ భార్య, పిల్లలతో కలిసి దిగిన ఫొటోను పంత్ షేర్ చేస్తూ.. ‘సరే మీ పిల్లలను నేను చూసుకుంటా.. నువ్వు భార్యతో సినిమాకు వెళ్లు’ అంటూ పంచ్ విసిరాడు. ఇద్దరి మధ్య జరిగిన ఆ గొడవను గుర్తు చేస్తూ నిజంగా పంత్ బెస్ట్ బేబీసిట్టర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
If you enjoyed this Post, Sign up for Newsletter
(And get your daily news straight to your inbox)
Tags : world cup 2019 Rishabh Pant Pakistan Mahendra Singh Dhoni india national cricket team sports cricketOther Articles
![]()
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: టాప్ ప్లేస్ లోనే కొనసాగుతున్న టీమిండియా
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
![]()
లండన్ హోటల్లో టీమిండియా మహిళా క్రికెటర్ బ్యాగ్ చోరీ
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
![]()
దీప్తీ శర్మ రనౌట్ వివాదంలో తెరదించిన క్రీడా విశ్లేషకుడు
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
![]()
మహిళల టీ20 ఆసియా కప్ బరిలో తెలుగమ్మాయి మేఘన
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
![]()
టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్‌కు తప్పిన పెను ప్రమాదం
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more