Piyush Chawla achieves this feat in IPL ఐపీఎల్ లో 150 వికెట్లు సాధించిన రెండో భారత బౌలర్

103 and counting ms dhoni s average in successful odi chases soars

Piyush Chawla, Kolkata Knight Riders, Indian Premier League, IPL 2019, most wickets in IPL, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Indian Premier League (IPL) 2019: Kolkata Knight Riders spinner Piyush Chawla became only the 2nd Indian bowler in the history of Indian Premier League to complete 150 wickets.

ఐపీఎల్ లో 150 వికెట్లు సాధించిన రెండో భారత బౌలర్

Posted: 04/29/2019 08:12 PM IST
103 and counting ms dhoni s average in successful odi chases soars

ఐపీఎల్ లో క్రికెటర్లు అదరగోడుతున్నారు. తమ ప్రతిభను చాటుకోవడంలో ఏ వేదికైతేనేమని పత్తాను చాటుతున్నారు. పన్నెండవ సీజన్ తో రాణిస్తున్నా అటగాళ్లు రికార్డుల వేటలోనూ నిమగ్నమయ్యారు. తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రతిభ చూపించి జట్టుకు అసాధారణమైన స్కోరు తెచ్చిపెట్టారు ఆండ్రీ రస్సెల్, హార్దిక్ పాండ్యా. వీరితో పాటు ఇదే మ్యాచ్‌లో మరో ప్లేయర్ ప్రత్యేకమైన ఘనత సాధించాడు.

ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో 150వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు. టీమిండియా వెటరన్ ప్లేయర్ పీయూశ్ చావ్లా ముంబై ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా‌ను అవుట్ చేసి ఈ జాబితాలోకి అడుగుపెట్టాడు. తానే బౌలింగ్ వేసి క్యాచ్ అందుకోవడం ద్వారా ఈ వికెట్ చేజిక్కించుకున్నాడు. ఈ ఘనత సాధించడానికి చావ్లా 156మ్యాచ్‌ల సమయం తీసుకోవాల్సి వచ్చింది. ఈ జాబితాలో పీయూశ్ చావ్లా కంటే ముందు లసిత్ మలింగ ఆ స్థానాన్ని దక్కించుకున్నాడు.

మ్యాచ్‌లో ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా భారీ టార్గెట్ నిర్దేశించింది. 233 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఒత్తిడికి లోనై వికెట్లను చేజార్చుకుంది. వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేస్తూ స్కోరు బోర్డు పరుగులు పెట్టించాడు హార్దిక్ పాండ్యా. 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి.. 34 బంతుల్లో 91 పరుగులు చేయగలిగాడు. చివరికి నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7వికెట్లు నష్టపోయి 198 పరుగులు మాత్రమే చేసి 34  పరుగుల తేడాతో ఓటమికి గురైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles