సొంతగడ్డపై వెస్టిండీస్‌తో తలపడిన మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమైయ్యాడు కేఎల్ రాహుల్. ఆస్ట్రేలియాతో ఆడిన 3 టెస్టుల్లో వరుస స్కోర్లు 2, 44, 2, 0, 9గా పూర్తి నిరాశపరిచాడు. దీంతో పూర్తిగా ఫామ్ కోల్పోయిన రాహుల్ ను సొంతగడ్డపై ఆస్ట్నేలియాతో ఆడించడం వృథా అనే భావించారంతా.. జట్టు కూర్పుపై సందేహాలు మొదలయ్యాయి. కానీ, ఫిబ్రవరి 24 ఆదివారం జరిగిన మ్యాచలో 35బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన రాహుల్, రెండో టీ20 ఫిబ్రవరి 27న అదే స్థాయిలో అదరగొట్టాడు.
26బంతుల్లో 47 పరుగులతో ఆకట్టుకున్నాడు. అసలు ఈ గ్యాప్ లో రాహుల్ ఏం చేశాడు. వివాదాల్లోకి ఇరుక్కుని బయటకు వచ్చిన రాహుల్.. తిరిగి ఫామ్ ఎలా దక్కించుకున్నాడని ఆలోచిస్తే.. ఆస్ట్రేలియా పర్యటనలో విఫలమైన తర్వాత రాహుల్ ను టీమిండియా మేనేజ్మెంట్ పక్కకు పెట్టేసింది. ఇండియా ఏ జట్టుకు అప్పగించింది. ఆ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్న టీమిండియా మాజీ క్రికెట్ ద్రవిడ్.. కేఎల్ రాహుల్ ను సాన బెట్టాడు. తిరిగి ఫామ్ దక్కేలా చేశాడు. రెండు అనధికారిక టెస్టులకు ఇండియా ఏ జట్టులో ఆడి వరుసగా 89, 81 పరుగులు చేయడంతో టీమిండియాలోకి మళ్లీ పిలుపొచ్చింది.
'ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి విరామం రాగానే భారత్ కు వచ్చేశా. నా ఆటలో లోపాలను సరిచేసుకున్నా. అదృష్టవశాత్తు ఇండియా ఏ గేమ్స్ అందుకు బాగా ఉపయోగపడ్డాయి. ఒత్తిడి తక్కువ ఉండటంతో నా నైపుణ్యాలపై ఫోకస్ చేయడం సాధ్యపడింది. రాహుల్ ద్రవిడ్‌తో చాలా సమయం గడిపేందుకు అవకాశం దొరికింది. ఆ జట్టులో మిడిల్ ఆర్డర్ లో ఆడడం బాగా కలిసొచ్చింది' అని రాహుల్ మీడియా సమావేశంలో పేర్కొన్నాడు. సొంతగడ్డపై ఆస్ట్ర్రేలియా చేతిలో ఓడిపోయిన భారత్.. తొలి సిరీస్ అయిన టీ20ని 0-2తో కోల్పోయింది. మార్చి2 నుంచి జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌లో ఆడి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more