Oman Dismissed for 24 Against Scotland 20 బంతుల్లో వన్డే మ్యాచ్ లో విజయం

Oman bowled out for 24 off 17 1 overs scotland win in just 3 2 overs

Oman vs Scotland scorecard, Oman 24 all out, Oman cricket, Scotland cricket scores, Jatinder Singh Oman, A Lalcheta Oman Crket, Adrian Neil Oicman, Oman cricket scorecard, sports news,sports, latest sports news, cricket

Oman stumbled to a new low as they were bundled out for 24 in a List A match against Scotland at the Al-Amerat Cricket Ground on Tuesday. Khawar Ali (15) was the only player who managed to reach double-digit score

సంచలనం: 20 బంతుల్లో వన్డే మ్యాచ్ లో విజయం

Posted: 02/19/2019 08:47 PM IST
Oman bowled out for 24 off 17 1 overs scotland win in just 3 2 overs

క్రికెట్ మ్యాచ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే..! సులభంగా గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోవచ్చు. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్ లో గెలవొచ్చు. ఒక్కోసారి పరుగుల వరద పారుతుంది. వన్డే మ్యాచ్ లో ఒక ఇన్నింగ్స్ లో 400కు పైగా పరుగులు చేసిన సందర్భాలు ఉన్నాయి. 50కే ఆలౌటైన చెత్త రికార్డులూ ఉన్నాయి. తాజాగా ఇలాంటి చిత్రవిచిత్రమే స్కాట్ లాండ్-ఒమన్ వన్డే మ్యాచ్ లో జరిగింది. 50 ఓవర్ల మ్యాచ్ ను 20 బంతుల్లోనే గెలిచి రికార్డు సృష్టించింది స్కాటిష్ టీమ్.

ఒమన్-స్కాట్లాంట్ వన్డే సిరీస్‌లో భాగంగా ఒమన్‌లోని అల్ అమెరాత్ స్టేడియంలో తొలి వన్డే జరిగింది. మ్యాచ్‌లో ఒమన్ ఆటగాళ్లకు స్కాట్‌లాండ్ బౌలర్లు ముచ్చెమటలు పట్టించారు. మొదట బ్యాటింగ్ చేసిన ఒమన్ జట్టు 17.1 ఓవర్లకే కుప్పకూలింది. 24 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయింది. ఆ స్కోర్‌లో 15 పరుగులు ఖవార్ అలీ చేసినవనే..! టీమ్‌లో ఆరుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్ అయ్యారు. మహ్మద్ నదీమ్, అజయ్ లాల్చెతా రెండేసి పరుగులు చేశారు. ఖుర్రామ్ నవాజ్, బాదల్ సింగ్ చెరో పరుగు చేశారు.

మొత్తంగా 11 మంది బ్యాట్స్‌మెన్ కలిసి 24 పరుగులు మాత్రమే చేశారు. ఇక స్కాటిష్ బౌలర్లలో రైద్రి స్మిత్, ఆండ్రీన్ నీల్ చెరో 4 వికెట్లు తీశారు. ఇక 25 పరుగుల అతిస్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ జట్టు 3.2 ఓవర్లలోనే విజయం సాధించిది. ఓపెనర్లు మాథ్యూ క్రాస్ 10, కైల్ కోట్జర్ 16 పరుగులు చేశారు. 3.2 ఓవర్లలో 26 రన్స్ చేసి ఘన విజయం సాధించింది స్కాటిష్ టీమ్. అంటే 50 ఓవర్ల మ్యాచ్‌ని కేవలం 20 బంతుల్లోనే ఫినిష్ చేసిందన్నమాట..!

Today Scotland defeated Oman by 10 wkts with 280 balls to spare at the Al Amerat Cricket Ground in Oman in a 50 over game.
Oman 24/10 in 17.1 overs
Scotland 26/0 in 3.2 overs
Had it been an official ODI game, this would have been the biggest margin of victory by balls remaining!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : oman  oman 24  oman vs scotland  Oman cricket  Scotland cricket  sports  cricket  

Other Articles