India beat Australia by 7 wickets, win ODI series 2-1 టీమిండియా నూతన అధ్యాయం.. అసీస్ గడ్డపై తొలివన్డే సిరీస్ విజయం

Chahal and dhoni script historic series triumph against australia

India vs Australia ODI,india national cricket team,ind vs aus odi,Ind vs Aus live score,Ind vs Aus,Australia national cricket team, ODI Series, Team India, Virat Kohli, MS Dhoni, Kedar Jadhav, Yazuvendra chahal, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

India added the first bilateral ODI series win in Australia to their historic 2-1 Test series triumph after the hosts won the opening match in Sydney by 34 runs and Virat Kohli's team levelled with a six-wicket win in Adelaide.

చరిత్ర సృష్టించిన టీమిండియా.. అసీస్ గడ్డపై తొలివన్డే సిరీస్

Posted: 01/18/2019 06:31 PM IST
Chahal and dhoni script historic series triumph against australia

అస్ట్రేలియా గడ్డపై టీమిండియా చరిత్రను సృష్టించింది. దశాబ్దాల క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కంగారులను ఓడించి వన్డే సిరీస్ ను కైవసం చేసుకుని విజయగర్వంతో దూసుకుపోతుంది. మెల్ బోర్న్ వేదికగా జరిగిన మూడవ, చివరి వన్డేలో ఏడు వికెట్లతో విజయాన్ని అందుకున్న విరాట్ సేన చరిత్రలో తొలిసారిగా కంగారుల గడ్డపై అడిన ద్వైపాక్షిక సిరీస్ ను అందుకుంది. మూడు మ్యాచుల సిరీస్ లో రెండు మ్యాచులను కైవసం చేసుకుని అసీస్ గడ్డపై నూతనాధ్యాయం రచించింది.

ఆఖరు వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో మాజీ సారధి మిస్టర్ కూల్ ఎంఎస్ ధో్ని తనదైన స్టైల్ లో తాను మ్యాచ్ ఫినిషర్ అని మరోమారు నామసార్థకం చేసుకున్నాడు. మ్యాచ్ ను చివరి ఓవర్ లో కూల్ గా విజయతీరాలకు చేర్చాడు. ఇక కీలకమైన ఈ మ్యాచ్ విజయతీరాలకు చేర్చడంలో ధోనికి కేదార్ జాదవ్ కూడా తనవంతుగా సహకరించాడు. అర్థశతకంతో రాణించాడు. ఎలాంటి తొందరపాటు లేకుండా టైమింగ్, ప్లేస్ మెంటును నమ్ముకుని తనదైన ఆటను అడుతూ గెలుపుదిశగా జట్టును నడిపించాడు.

అసీస్ బ్యాటింగ్ సమయంలో భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్ కంగారుల నడ్డి విరిచాడు. పది ఓవర్ల వరకు పటిష్టస్థితిలో వున్న అసీస్ ఓపనర్లను కేవలం నాలుగు బంతుల తేడాతో వెనక్కు పంపించిన చాహాల్.. ఆ తరువాత క్రమంగా వికెట్లను పడగగొడుతూ మెల్ బోర్న్ వన్డేలో ఏకంగా ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకుని అసీస్ ను అత్యధిక స్కోరు చేయకుండా కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా టీమిండియా తొలిసారిగా అసీస్ గడ్డపై వన్డే సిరీస్ విజయం సాధించింది.

అంతకుముందు రెండు సార్లు వన్డే టోర్నీలు నెగ్గినా...కంగారూ టీమ్‌తో ఆడిన వన్డే సిరీస్‌లో మాత్రం నెగ్గలేకపోయింది. 1985లో జరిగిన వన్డే వరల్డ్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్‌ విన్నర్‌గా నిలిచింది. అదే భారత్‌కు కంగారూ గడ్డపై తొలి వన్డే టోర్నీ విజయం. 2008లో ట్రై సిరీస్ నెగ్గింది. అప్పటి టోర్నీలో శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లపై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించి ట్రై సిరీస్ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో ఆసీస్ టీమ్‌నే ఓడించి చరిత్ర సృష్టించింది. మెల్‌బోర్న్ వన్డే నెగ్గి కంగారూ టీమ్‌పై తొలి ద్వైపాక్షిక సిరీస్ నెగ్గింది.

231 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు అదిలోనే చుక్కెదురైంది. అద్బుత ఫామ్ లో ఉన్న ఓపెనర్ రోహిత్ శర్మ 9 పరుగులకే స్లిప్ లోకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో కెప్టెన్ విరాట్ కొహ్లీ అదిలోనే క్రిజ్ లోకి చేరకున్నాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ కలిసి అచితూచి అడుతూ స్కోరుబోర్డును ముందుకు కదిలించాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 44 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఆ తరువాత బౌలర్ కే క్యాచ్ ఇచ్చిన ధావన్ వెనుదిరగక తప్పలేదు.

దీంతో సెకండ్ డౌన్ లో బ్యాటింగ్ వచ్చిన ధోనీ ఆడిన తొలి బంతి క్యాచ్ గా వెళ్లినా.. ఫైన్ లెగ్ లో వున్న ఫీల్డర్ దాన్ని మిస్ చేయడంతో డౌకౌట్ కావాల్సిన ధోనికి మరో లైఫ్ లభించింది. దీంతో ఎలాంటి రిస్కీ షాట్ల జోలికి వెళ్లకుండా..ఆచి తూచి బ్యాటింగ్ చేశాడు. కెప్టెన్ విరాట్‌తో కలిసి ధోనీ జట్టుకు విలువైన భాగస్వామ్యాన్ని అందించాడు. 26.3 ఓవర్లలో ఇండియా 100 పరుగుల మార్క్ దాటింది. 46 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ ఔటైనా...కేదార్ జాదవ్‌తో కలిసి జట్టును లక్ష్యానికి మరింత చేరువ చేశాడు ధోనీ.

74 బంతుల్లో వన్డేల్లో 70వ హాఫ్ సెంచరీ. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌‌ను ధోనీ కూల్‌గా ఫినిష్ చేశాడు. అంతకుముందు ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేయకుండా కట్టడి భారత బౌలర్లు కట్టడి చేశారు. యజ్వేంద్ర చహాల్ స్పిన్ మ్యాజిక్‌తో ఆసీస్‌ టీమ్‌ 230 పరుగులకే కుప్పకూలింది. 48.4 ఓవర్లలోనే కంగారూ టీమ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. భారత బౌలర్లలో చహాల్ 6 వికెట్లు తీయగా...భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ చెరో రెండు వికెట్లు తీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles