Virat Kohli on perth test defeat పెర్త్ టెస్టు ఓటమిపై విరాట్ స్పందన ఇది..

Virat kohli after defeat says thought four fast bowlers would be enough

india vs australia, ind vs aus, india vs australia 2nd test, virat kohli, india vs australia test, india vs australia perth test, ind vs aus perth test, cricket, cricket news, sports news, latest sports news, sports

India captain Virat Kohli on Tuesday spoke on the team’s decision to play with four fast bowlers and no spinners after the visitors suffered a 146-run defeat at the hands of Australia at Perth.

పెర్త్ టెస్టు ఓటమిపై విరాట్ స్పందన ఇది..

Posted: 12/18/2018 05:03 PM IST
Virat kohli after defeat says thought four fast bowlers would be enough

ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా మంగళవారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో తన తప్పిదం కారణంగానే భారత్ జట్టు ఓడిపోయిందని కెప్టెన్ విరాట్ కోహ్లీ అంగీకరించాడు. 287 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా ఆటలో చివరిరోజైన మంగళవారం ఓవర్‌నైట్ స్కోరు 112/5తో రెండో ఇన్నింగ్స్‌‌ని కొనసాగించిన భారత్ జట్టు 140 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో.. 146 పరుగుల తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా నాలుగు టెస్టుల సిరీస్‌ని 1-1తో సమం చేసింది.

వాస్తవానికి పెర్త్‌లో నూతనంగా నిర్మించిన ఆప్టస్‌ స్టేడియం‌ పేస్, బౌన్స్‌కి అతిగా అనుకూలిస్తుందంటూ ఆస్ట్రేలియా అతిగా ప్రచారం చేసింది. దీనికి తోడు పిచ్‌పై పచ్చిక ఉండటంతో.. ఫాస్ట్ బౌలర్లకే ఎక్కువ అనుకూలం అని టీమిండియా భావించింది. కానీ.. తొలిరోజే ఆటగాళ్ల పాద ముద్రలతో పిచ్ గరుకుగా మారిపోయి.. అస్థిర బౌన్స్‌తో పాటు స్పిన్నర్ల‌కి సహకారం లభించింది. పిచ్ స్పిన్నర్లకి కూడా అనుకూలించే అవకాశమున్నా.. రవీంద్ర జడేజాని పక్కన పెట్టడం భారత జట్టుని దెబ్బతీసిందని మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ అంగీకరించాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ 8/106 గణాంకాలతో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌’గా నిలవడం గమనార్హం.

‘పెర్త్ పిచ్‌ని పరిశీలించిన తర్వాత.. నలుగురు ఫాస్ట్ బౌలర్లు టీమ్‌లో ఉంటే చాలు అనుకున్నా. రవీంద్ర జడేజాని తీసుకోవాలనే ఆలోచనే నాకు రాలేదు. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. నిజాయతీగా చెప్పాలంటే ఒక స్పిన్నర్‌ని తుది జట్టులో ఆప్షన్‌గా ఉంచుకోవాలనే ఆలోచనే నాకు లేకపోయింది. ఈనెల 26 నుంచి జరగనున్న మెల్‌బోర్న్ టెస్టులో తప్పిదాలను దిద్దుకుని కచ్చితంగా టీమ్‌ని గెలిపించే ప్రదర్శన చేస్తాను’ అని విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs australia  virat kohli  pacers  spinners  perth test  ind vs aus  cricket  sports  

Other Articles