Gambhir Upset With Umpire Decision అంపైర్ ‘ఔట్’ నిర్ణయంపై గంభీర్ ఆగ్రహం..!

Watch gambhir infuriated after umpire gives him out

Gautam Gambhir, MS Dhoni, India, England, India tour of England 2018, India vs England, sports, world, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Gautam Gambhir wasn't impressed with the umpire's decision, who had adjudged him out. The left-handed batsman is playing for Delhi in Ranji Trophy.

వామ్మో.. అంపైర్ ‘ఔట్’ నిర్ణయంపై గంభీర్ ఆగ్రహం..!

Posted: 11/12/2018 08:07 PM IST
Watch gambhir infuriated after umpire gives him out

భారత వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మైదానంలో మరోసారి తన అసహనాన్ని ప్రదర్శించి విమర్శలు ఎదుర్కొన్నాడు. మైదానంలో గంభీర్ అసహనం వ్యక్తం చేయడం, కోపాన్ని ప్రదర్శించడం గత కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్ లో విరాట్ కోహ్లీతో పెద్దఎత్తున వాగ్వాదానికి దిగిన ఈ ఓపెనర్.. ఓ దేశవాళీ మ్యాచులో మనోజ్ తివారీని ఏకంగా కొట్టేందుకు దూసుకెళ్లిన విషయం కూడా పాఠకులకు తెలిసిందే.

గత రెండేళ్లుగా టీమిండియాకి దూరంగా ఉంటున్న గౌతమ్ గంభీర్.. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ లో ఢిల్లీ జట్టు తరపున రంజీల్లో ఆడుతున్నాడు. ఈ టోర్నీలో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌తో ఈరోజు ఆరంభమైన మ్యాచులో ఓపెనర్ గా బరిలోకి దిగిన గౌతమ్ గంభీర్ 44 పరుగులు పూర్తి చేసి.. అర్థశతకాన్ని సాధించాలన్న కృతనిశ్చయంతో వున్న సమయంలో అంపైర్ తప్పు నిర్ణయంతో ఔటయ్యాడు. బంతి బ్యాటుకి తాకకపోయినా.. అంపైర్ ఔట్ ఇవ్వడంతో మైదానంలోనే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.

హిమాచల్ ప్రదేశ్ స్పిన్నర్ మయాంక్ దాదర్ ఆఫ్ స్టంప్‌ లైన్ పై విసిరిన బంతి‌ని స్క్వేర్ లెగ్ దిశగా కట్ చేసేందుకు గౌతమ్ గంభీర్ ప్రయత్నించాడు. కానీ.. అనూహ్యంగా బంతి టర్న్ తీసుకుని గంభీర్ బ్యాట్‌కి అందకుండా నేరుగా వెళ్లి ఫ్యాడ్స్‌ని తాకి గాల్లోకి లేచింది. దీంతో.. గంభీర్ కి సమీపంలో ఉన్న ఫీల్డర్ క్యాచ్‌ అందుకుని ఔట్ కోసం అప్పీల్ చేయగా.. అంపైర్ వేలెత్తేశాడు. ఈ ఔట్ నిర్ణయంపై కొన్ని క్షణాలపాటు క్రీజులోనే అసహనం వ్యక్తం చేసిన గంభీర్.. ఆ తర్వాత మైదానాన్ని వీడాడు. రిప్లైలో బంతి బ్యాట్‌కి తాకలేదని తేలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gautam Gambhir  Umpire  Ranji Trophy 2018  Ranji trophy  Delhi  Himachal Pradesh  sports  cricket  

Other Articles