Rohit, Rayudu tons power India to 377-5 రోహిత్, రాయుళ్ల శతకాలతో భారత్ పటిష్టం..

Rohit sharma rayudu tons drive india to 377 5 in 4th odi

Ind vs wi, India vs West Indies, Rohit Sharma, Ambati Rayudu, Ind vs WI Live Score, India vs West Indies 2018, sports, world, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Dominant centuries from Rohit Sharma and Ambati Rayudu powered India to an imposing 377 for five in the fourth one-day international against West Indies in fourth ODI.

విండీస్ పై శతకాలతో విరుచుకుపడ్డ రోహిత్, రాయుడు

Posted: 10/29/2018 07:37 PM IST
Rohit sharma rayudu tons drive india to 377 5 in 4th odi

వెస్టిండీస్‌తో ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఈరోజు జరుగుతున్న నాలుగో వన్డేలో భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (162: 137 బంతుల్లో 20x4, 4x6) రికార్డు స్కోరుతో చెలరేగాడు. 98 బంతుల్లో 13x4, 1x6 సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్న రోహిత్ శర్మ.. ఆ తర్వాత కేవలం 33 బంతుల్లోనే 150 పరుగుల మైలురాయిని అందుకుని వ్యక్తిగత స్కోరు 162 వద్ద ఔటయ్యాడు. దీంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ జట్టు 43.5 ఓవర్లు ముగిసే సమయానికి 312/3తో నిలిచింది.

గౌహతి వేదికగా జరిగిన తొలి వన్డేలోనూ రోహిత్ శర్మ 152 పరుగులతో అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. ఓపెనర్ శిఖర్ ధావన్ (38), కెప్టెన్ విరాట్ కోహ్లి (16) తక్కువ స్కోరుకే ఔటైనా.. మొక్కవోని దీక్షతో ఆడిన రోహిత్ శర్మ విండీస్ స్పిన్నర్లని లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లు బాదేశాడు. ముఖ్యంగా.. నర్స్ బౌలింగ్‌లో అయితే.. వరుసగా బౌండరీల మోత మోగించాడు. ఈ క్రమంలోనే మూడో వికెట్‌కి అంబటి రాయుడితో కలిసి అభేద్యంగా డబుల్ సెంచరీ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

అటు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అంబటి రాయుడు శతకంతో చెలరేగాడు. దూకుడుగా ఆడినా రాయుడు 80 బంతుల్లోనే 8x4, 4x6 సాయంతో 100 పరుగులు మైలురాయిని అందుకున్నాడు. సుదీర్ఘ కెరీర్‌లో రాయుడికి ఇది మూడో శతకం కాగా.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ జట్టు 46.4 ఓవర్లలో 336/3తో కొనసాగుతోంది. అంతకముందు ఓపెనర్ రోహిత్ శర్మ (162: 137 బంతుల్లో 20x4, 4x6) భారీ శతకం బాదిన విషయం తెలిసిందే.

ఓపెనర్ శిఖర్ ధావన్ (38), కెప్టెన్ విరాట్ కోహ్లి (16) తక్కువ స్కోరుకే ఔటవడంతో.. జట్టు స్కోరు 101 వద్ద క్రీజులోకి వచ్చిన రాయుడితో కలిసి రోహిత్ శర్మతో మూడో వికెట్‌కి అభేద్యంగా 211 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన చేయడం ద్వారా మళ్లీ భారత జట్టులోకి పునరాగమనం చేసిన రాయుడు.. ఆసియా కప్‌ నుంచి జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rohit Sharma  Ambati Rayudu  centuries  India vs west indies  virat kohli  sports  cricket  

Other Articles