Dhoni Takes Stunning Diving Catch ధోని సూపర్ క్యాచ్.. బ్యాట్స్ మెన్ కన్సూజ్..

Dhoni takes stunning diving catch sends twitter into overdrive

MS Dhoni, India cricket, India vs West Indies, West Indies, virat kohli, Team India, india vs west indies 2018, india vs west indies 3rd odi, India, Ind vs WI 3rd ODI, cricket, sports, sports news, latest sports news, latest news

MS Dhoni was dropped from the Twenty20 Internationals for the series against Windies and Australia, Dhoni showed he still had it in him to be in contention when he took a brilliant diving catch to get rid of the Windies opener Chandrapaul Hemraj.

ధోని సూపర్ క్యాచ్.. బ్యాట్స్ మెన్ కన్సూజ్..

Posted: 10/27/2018 04:50 PM IST
Dhoni takes stunning diving catch sends twitter into overdrive

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అద్భుత క్యాచ్ తో పుణె వేదికగా వెస్టిండీస్ తో జరుగుతున్న మూడో వన్డేలో విండీస్ తొలి వికెట్ కోల్పోయింది. విండీస్ తో మిగిలిన మూడు మ్యాచులకని ఇవాళ్టి మ్యాచ్ లో అడిన భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా.. తనదైన శైలిలో బంతిని విసిరి టీమిండియాకు తొలి వికెట్ ను అందించాడు. అయితే దీనిని సాథ్యం చేసింది మాత్రం కేవలం మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనియే. అదెలా అంటారా..

ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో ఓపెనర్ చంద్రపాల్ హేమరాజ్ (15: 20 బంతుల్లో 2x4, 1x6) వరుసగా 4, 6 బాదాడు. దీంతో అతడ్ని కొంత ఇబ్బందిపెట్టేలా బూమ్రా కొంత ఎత్తులో బంతిని వేశాడు. అయితే ఆ బంతిని కూడా హిట్ చేసేందుకు ప్రయత్నించాడు హేమరాజ్. కానీ.. బ్యాట్ ఎడ్జ్‌ తగలడంతో బంతి ఫైన్ లెగ్ లో గాల్లోకి లేచింది. అటుగా ఓ ఫీల్డర్ దానిని అందుకునేందుకు వస్తున్నా.. ఆ బంతి తనదని.. మెరుపు వేగంతో పరుగెత్తుకుంటూ వెళ్లిన వికెట్ కీపర్ ధోని.. రివర్స్ లో డైవ్ చేస్తూ క్యాచ్ ని అందుకున్నాడు.

వాస్తవానికి ఫైన్‌లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఖలీల్ అహ్మద్ ఆ క్యాచ్‌ని అందుకుంటాడని అంతా భావించారు. కానీ.. అతను బౌండరీ లైన్‌కి సమీపంలో ఉండటాన్ని గ్రహించిన ధోని.. చిరుతని తలపించే పరుగుతో వెళ్లి డైవ్ చేస్తూ క్యాచ్‌ని అందుకున్నాడు. 37ఏళ్ల ధోనీ.. పరుగెత్తిన తీరుకి మ్యాచ్ కామెంటేటర్లు సైతం ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఓపెనర్ కీరన్ పొవెల్ (21: 25 బంతుల్లో 2x4, 1x6) కూడా బుమ్రా బౌలింగ్‌లోనే స్లిప్‌లో రోహిత్ శర్మకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో.. 8.1 ఓవర్లు ముగిసే సమయానికి వెస్టిండీస్ 38/2తో నిలిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  India cricket  West Indies  virat kohli  Team India  india vs west indies  3rd odi  cricket  sports  

Other Articles