Pujara bats with water bottle in his pocket సెంటిమెంట్ల పూజారా జేబులో ఏముందో తెలుసా.?

Twitter impressed as cheteshwar pujara comes up with a unique idea

India vs West India, Paytm Test series, cheteshwar pujara, Prithvi Shaw, Virat Kohli, Rajkot Test, sports, world, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

India batsman Cheteshwar Pujara was spotted carrying a water bottle in his pocket while batting on Day 1 of the first Test vs West Indies

సెంటిమెంట్ల పూజారా జేబులో ఏముందో తెలుసా.?

Posted: 10/04/2018 03:34 PM IST
Twitter impressed as cheteshwar pujara comes up with a unique idea

రాజ్ కోట్ వేదికగా అతిధ్య జట్టు వెస్టిండీస్ తో ఇవాళ ప్రారంభమైన  తొలిటెస్టులో మ్యాచ్ ప్రారంభమైన తొలి ఓవర్ లోనే ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌ ఎల్బీడబ్యూగా డకౌట్‌ అయ్యి వెనుదిరగడంతో.. జట్టులోకి వచ్చిన స్థానిక ఆటగాడు ఛెతేశ్వర్‌ పుజారా అచితూచి అడుతూ.. మరోవైపు వేగంగా అడుతున్న పృధ్వీషాకు వెన్నుదన్నుగా నిలస్తూనే పరుగులను సాధిస్తూ అర్థశతకాన్ని పూర్తి చేశాడు. ఆ తరువాత కూడా బ్యాటింగ్ వేగాన్ని పెంచిన పూజారా 130 బంతుల్లో 86 పరుగులు చేశాడు.

అయితే రాజ్ కోట్ లోకల్ బాయ్ కి సెంటిమెంట్లు ఎక్కువని అక్కడందరికీ తెలసిందే. ఈ ప్రస్తావన ఎందుకని అంటున్నారా.? పృథ్వీషాతో కలిసి రెండో వికెట్‌కు 206 పరుగుల భాగస్వామ్యం అందించిన నయావాల్‌ బ్యాటింగ్‌ చేస్తుంటే కాసేపు అందరినీ ఒక సందేహం వేధించింది. అతడి ప్యాంటు ముందు జేబులో ఏదో ఉన్నట్టు కనిపించింది. అదేంటి అన్నదే ప్రశ్న అందరిలోనూ ఉత్పన్నమైంది. అతడికి నమ్మకాలు ఎక్కువన్న విషయం తెలిసిన వారు ఎవో ఊహాగానాలకు తెరతీసారు.

సెంటిమెంట్లకు అధిక ప్రాధాన్యతనిచ్చే పూజారా ఏం పెట్టుకున్నాడో అని సందేహ పడ్డారు! ఐతే ప్రస్తుతం మ్యాచ్‌ జరుగుతున్న రాజ్‌కోట్‌లో ఎండవేడిమి ఎక్కువ. అందుకే మ్యాచ్‌ మధ్యలో మంచినీటి కోసం రిజర్వు ఆటగాడిని ఎందుకు రప్పించాలి అనుకున్నాడో ఏమో ఒక చిన్న మంచినీటి సీసాను జేబులో దాచుకున్నాడు. దాహం వేసినప్పుడల్లా బయటకు తీసి గొంతు తడుపుకొన్నాడు. దీంతో పుజారా జేబులో ఉన్నది మంచి నీటిసీసానా అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Beating Rajkot's heat, Pujara's way

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles