MSD captains India for 200th time in ODIs ధోని.. వన్డేలకు కెప్టెన్సీలో రికార్డు.. 200వ మ్యాచ్ కు

Ms dhoni leads india out for 200th time in odis

Virat Kohli, Rohit Sharma, ms dhoni, India vs Afghanistan, Ind vs Afg Asia Cup Score, asia cup 2018, sports, Cricket

MS Dhoni returned to lead India after 696 days when Rohit Sharma was rested for the Super Four match vs Afghanistan. Dhoni became only the 3rd cricketer to lead his country in 200 ODIs.

ధోని.. వన్డేలకు కెప్టెన్సీలో రికార్డు.. 200వ మ్యాచ్ కు

Posted: 09/25/2018 07:26 PM IST
Ms dhoni leads india out for 200th time in odis

మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ కెప్టెన్‌గా భారత జట్టుని ఇవాళ నడిపిస్తున్నాడు. గత ఏడాది జనవరిలో వన్డే, టీ20 కెప్టెన్సీ నుంచి ధోనీ వైదొలడంతో అతని స్థానంలో జట్టు పగ్గాలని విరాట్ కోహ్లీ అందుకున్నాడు. అప్పటి నుంచి ఒకవేళ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిస్తే అతనికి బదులుగా టెస్టుల్లో రహానె.. వన్డే, టీ20ల్లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉంటూ వస్తున్నారు.

తాజాగా యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లోనూ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మనే జట్టుని నడిపిస్తున్నాడు. కానీ.. ఈరోజు అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు వైస్ కెప్టెన్ శిఖర్ ధావన్‌కి కూడా టీమిండియా మేనేజ్‌మెంట్ రెస్ట్ ఇచ్చింది. దీంతో.. 696 రోజుల తర్వాత మళ్లీ ధోనీ చేతికి టీమిండియా పగ్గాలొచ్చాయి.

గత ఏడాది కెప్టెన్సీ వదిలేసిననాటికి 199 వన్డేలకి నాయకత్వం వహించిన ధోనీ.. ఈరోజు వన్డేతో 200 మార్క్‌ని అందుకున్నాడు. దీంతో క్రికెట్ ప్రపంచంలో 200 వన్డేలకి కెప్టెన్సీ వహించిన మూడో క్రికెటర్ గా ధోనీ నిలిచాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ 2002-12 మధ్య కాలంలో 230 వన్డేలకి నాయకత్వం వహించగా.. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్టీఫెన్ ఫ్లెమింగ్ 218 వన్డేలతో రెండో స్థానంలో ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rohit Sharma  ms dhoni  India vs Afghanistan  Ind vs Afg Asia Cup  

Other Articles