beware of ashwin taught new delivery: rahman అశ్విన్ నేర్పిన మెలకువలను ప్రయోగిస్తా

Will implement mentor ashwin techniques on teamindia mujeeb ur rahman

India vs Afghanistan, maiden test, Mujeeb Ur Rahman, IPL 2018, indvsafg, indvafg, Ravichandran Ashwin, Ajinkya Rahane, India v/s Afghanistan, Kuldeep Yadav, Virat Kohli, Ravindra Jadeja, Dinesh Karthik, bengaluru, chinnasamy stadium, ind vs afg, sports news,sports, latest sports news, cricket news, cricket

Mujeeb Ur Rahman revealed that he had begun his preparation for the inaugural Test in the IPL itself, having spent some time practicing at the M Chinnaswamy ahead of KXIP's second match of IPL 2018

అశ్విన్ నేర్పిన మెలకువలను ప్రయోగిస్తా

Posted: 06/13/2018 05:24 PM IST
Will implement mentor ashwin techniques on teamindia mujeeb ur rahman

భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తనకు ఓ కొత్త తరహా డెలివరీని నేర్పించాడని అఫ్గానిస్థాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ వెల్లడించాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2018 సీజన్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరఫున అశ్విన్, ముజీబ్ ఆడిన విషయం తెలిసిందే. నెట్స్ లో అశ్విన్‌ తనకు చాలా బౌలింగ్‌ మెలకువల్ని నేర్పించాడని.. వాటిని టీమిండియాపైనే తాను ప్రయోగిస్తానని చెప్పారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఏకైక టెస్టులో వాటిని ఆచరణలో పెడతానని ముజీబ్ ధీమా వ్యక్తం చేశాడు.

‘నేను చాలా బాగా బౌలింగ్ చేస్తున్నానని ఐపీఎల్ సమయంలో అశ్విన్ నాతో అన్నాడు. ఏ ప్రదేశంలో బంతులు విసిరితే వికెట్లు పడతాయి.. పరుగులు కట్టడి చేయచ్చో కూడా చెప్పాడు. ఆ సమయంలోనే ఓ కొత్త డెలివరీని అతను నాకు నేర్పించాడు. ఆ తర్వాత ఐపీఎల్ ముగిసినా కూడా ఆ బంతిని నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆ డెలివరీని వేసే సమయంలో.. వేళ్లపై భారం ఎక్కువగా పడుతుందని అప్పట్లో అశ్విన్ నాకు చెప్పాడు. ఇప్పుడు ఫర్వాలేదు.. ఆ బంతిని విసరడంపై ఇప్పుడు పట్టు సాధించాను. అశ్విన్‌ నాకు ఓ మెంటార్‌లాంటి వాడు’ అని ముజీబ్ వెల్లడించాడు. 17 ఏళ్ల ముజీబ్ చారిత్రక టెస్టు కోసం తాను ఇప్పటికే అన్ని వ్యూహాలతో సిద్ధమైనట్లు వెల్లడించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles