Australia Women seal ODI series over India ద్వైపాక్షిక వన్డే సిరీస్ అసీస్ వశం..

Australia women seal odi series over india women with big win

India Women vs Australia Women, southern stars, Smriti Mandhana, Nicole Bolton, Mithali Raj, Ellyse Perry, Deepti Sharma, Beth Mooney, Ashleigh Gardner, sports news, sports, latest sports news, cricket news, cricket

The Australian women's cricket team wrapped up their series with India 2-0 with a game to spare, taking the second ODI in Vadodara by 60 runs

అసీస్ తో వన్డే సిరీస్ చేజార్చుకున్న టీమిండియా

Posted: 03/15/2018 06:53 PM IST
Australia women seal odi series over india women with big win

వరల్డ్ కప్ లో సత్తాచాటిన టీమిండియా.. ద్వైపాక్షిక సిరీస్ లో మాత్రం కంగారులతో తడబాటుకు గైరంది. స్వదేశంలో జరుగుతున్నసిరీస్ లో ఒకటి తరువాత మరో మ్యాచులో కూడా ఓటమిని చవిచూసి వరుస పరాజయాలను ఎదుర్కొంది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే అసీస్ జట్టు సిరీస్ ను కైవసం చేసుకుంది. కాగా, భారత మహిళల జట్టు సిరీస్‌ చేజార్చుకుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇవాళ వడోదరలో్ జరిగిన రెండో మ్యాచులో అసీస్ జట్టు టీమిండియా మహిళల జట్టుపై 60 పరుగుల తేడాతో గెలుపోందింది.

టాస్‌ గెలిచిన తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత జట్టు.. అసీస్ పరుగుల వరదను నిలువరించలేకపోయింది. బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. ఓపెనర్‌ బోల్టన్‌(84), పెర్రి(70, నాటౌట్‌), మూనీ(56) రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. భారత బౌలర్‌ ఏక్తా బిస్త్‌కు 3, పూనమ్‌ యాదవ్‌కు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత 288 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ తడబడింది. 88 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌ ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే వికెట్లు కోల్పోతూ వచ్చింది.

ఓపెనర్‌ స్మృతి మంధాన(67) తప్ప మిగతా వారెవ్వరూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఫిట్‌నెస్‌ సాధించి తిరిగి జట్టులోకి వచ్చిన మిథాలీ రాజ్‌(15) కూడా నిరాశ పరిచింది. ఆసీస్‌ బౌలర్ల ధాటికి భారత్‌ విలవిల్లాడింది. 49.2 ఓవర్లలో 227 పరుగులకే భారత్‌ కుప్పకూలింది. దీంతో 60 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆసీస్‌ మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డును బోల్టన్‌ అందుకుంది. ఇక సిరీస్‌లో నామమాత్రమైన మూడో వన్డే ఆదివారం జరగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Australia  women's odi series  2nd ODI  Vadodara odi  Nicole Bolton  cricket  

Other Articles