భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్ సురేష్ రైనా అటు తన ఖాతాలో పలు ఘనతను నమోదు చేసుకుంటూనే ఇటు తన సహచరులను కూడా అధిగమించి వెళ్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో తనదైన ప్రదర్శన కనబర్చడంతో ముక్కోణపు టోర్నీకి ఆయనను ఎంపిక చేసిన సెలక్టర్ల అంచనాలను తక్కువ కానీయకుండా తన బ్యాటుతో మంత్రజాలం విసురుతున్నాడు.
తాజాగా రైనా.. టీమిండియా మాజీ కెపె్టన్ ధోనీని దాటేశాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రైనా.. ధోనీని వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలిచాడు. ముక్కోణపు టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్ లో రూనా 27 పరుగులు సాధించి.. ఈ ఘనతను నమోదు చేసుకున్నాడు. దీంతో రైనా పరుగుల సంఖ్య 1,452కి చేరింది. ధోనీ 1,444పరుగులతో ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇలా ధోనిని సురేష్ రైనా అధిగమించాడు. మరో 48 పరుగులు చేస్తే రైనా 1,500 పరుగుల క్లబ్‌లో చేరతాడు.
కాగా, విరాట్ కోహ్లీ(1,983), రోహిత్ శర్మ(1,696) అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. ముక్కోణపు టోర్నీలో భాగంగా భారత్ బుధవారం బంగ్లాదేశ్ తో తలపడనుంది. మూడు మ్యాచుల్లో రెండు గెలిచిన భారత్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇధిలావుండగా, ఈ ఏడాది జరిగే ఐపీఎల్ లో ధోనీ, రైనా చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిథ్యం వహించనున్న సంగతి తెలిసిందే. టీమిండియా త్వరలో విదేశీ పర్యటనలకు వెళ్లనున్న నేపథ్యంలో కోహ్లీ, ధోనీతో పాటు పలువురు ఆటగాళ్లకు బీసీసీఐ ముక్కోణపు టోర్నీ నుంచి విశ్రాంతి కల్పించింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more