Rahul Dravid wins off the field | హ్యాట్సాఫ్ ది వాల్.. అందరి మన్ననలు పొందుతున్న ద్రవిడ్

Bcci responded to dravid request

Rahul Dravid, BCCI, U-19 Team Staff, Equal Pay, Support Staff,Prize Money Cut Off, Rahul Dravid Prize Money

Rahul Dravid stands firm, India U-19 team staff get bigger awards, others recognised. Rahul Dravid's prize money for U-19 World Cup win reduced to Rs 25 lakh following his request. Dravid had asked the Indian cricket board to divide the prize money equally among the coaching staff. The board has agreed to his request and every member will now recieve Rs 25 lakh each.

ద్రవిడ్ విజ్నప్తికి స్పందించిన బీసీసీఐ

Posted: 02/26/2018 11:19 AM IST
Bcci responded to dravid request

టీమిండియా అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్ విజ్నప్తిపై భారతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు స్పందించింది. కప్ గెలిచిన అనంతరం ప్రకటించిన నజరానాపై ద్రవిడ్ వ్యతిరేకించిన విషయం తెలిసిందే. సమాన ప్రైజ్‌మనీ డిమాండ్‌ తో కదిలిన బోర్డు తాజాగా దానిని సవరించింది.

అండర్-19 ప్రపంచకప్‌ను దేశానికి అందించడంలో కీలకపాత్ర పోషించిన ద్రవిడ్‌కు తొలుత బీసీసీఐ రూ.50 లక్షల ప్రైజ్ మనీ ప్రకటించింది. క్రికెటర్లకు రూ.30 లక్షల చొప్పున, సిబ్బందికి రూ.20 లక్షల చొప్పున ప్రైజ్ మనీ ఇస్తున్నట్టు ప్రకటించింది. తనకు రూ.50 లక్షలు, సిబ్బందికి రూ.20 లక్షలు ప్రకటించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ద్రవిడ్.. వారు కూడా తనలాగే కష్టపడ్డారని, ప్రైజ్‌మనీ విషయంలో ఈ తేడాలెందుకంటూ బోర్డు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ ప్రకటనపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

దీంతో స్పందించిన బీసీసీఐ ప్రైజ్‌మనీ ప్రకటనను సవరించింది. గతంలో ద్రవిడ్‌కు ప్రకటించిన రూ.50 లక్షలను రూ.25 లక్షలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ద్రవిడ్ సహా సిబ్బందికి కూడా చెరో రూ.25 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. సపోర్టింగ్ స్టాఫ్‌ మరింతమందికి ఈ ప్రోత్సాహకం అందించాలని నిర్ణయిస్తూ మరింతమందిని జాబితాలో చేర్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles