rashid khan comments on kohli goes viral online కోహ్లీపై అప్ఘన్ స్పిన్నర్ రషీద్ సంచలన వ్యాఖ్య

Afghanistan spinner rahid khan sensational comments on virat kohli

rashid khan tweet on virat, rahsid khan twitter, rashid khan virat kohli, virat kohli, rashid khan, team india, south africa, zimbabwe, afganistan twitter, Cricket news, sports news, sports, latest sports updates, cricket

Afghanistan spin bolwer rashid khan made a sensational comments on teamindia captain and run machine virat kohli, that goes viral on line.

కోహ్లీపై అప్ఘన్ స్పిన్నర్ రషీద్ సంచలన వ్యాఖ్య

Posted: 02/17/2018 03:57 PM IST
Afghanistan spinner rahid khan sensational comments on virat kohli

ప్ర‌స్తుత క్రికెట్ లో అత్యుత్త‌మ బ్యాట్స్ మెన్ గా రాణిస్తున్న వారు ఎవ‌రంటే చాలా మంది చెప్పే పేరు పరుగుల యంత్రం, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే అని చెప్పడంలో సందేహమేమీ లేదు. స్వదేశమనా, విదేశమైనా.. బలమైన ప్రత్యర్థులా.. లేక బలహీన ప్రత్యర్ధులా అన్న తేడా లేకుండా ఎవరిపైనైనా సరే.. బంతులేసిది ఎంతటి బౌలర్ అయినా సరే.. వాటిని అలవోకగా బౌండరీలకు తరలించడంలో ఇప్పుడు విరాట్ ను మించినవారు లేరని చెప్పడం అతిశయోక్తి కాదు.

మరీముఖ్యంగా ఇత‌ర బ్యాట్స్ మెన్లకు సాధ్యం కాని రీతిలో ఛేజింగ్‌లో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డం కోహ్లీ ప్ర‌త్యేక‌త‌. ఈ క్రమంలో క్రితం రోజున దక్షిణాప్రికాతో ముగిసిన వన్డే సిరీస్ లో ఏకంగా మ్యాన్ అఫ్ ది మ్యాచ్, మ్యాన్ అప్ ది సిరీస్ కూడా కైవసం చేసుకున్న కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా పలువురు క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు, అటగాళ్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ జాబితాలో తాజాగా చేరిన మరో ఆటగాడు అప్ఘనిస్తాన్ కు చెందిన రషీద్ ఖాన్. అప్ఘన్ కు చెందిన ఈ స్పిన్ మాంత్రికుడు.. కోహ్లీని అభినందిస్తూ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశాడు. `ప‌రుగుల యంత్రం + శ‌త‌కాల యంత్రం + ఛేజింగ్ యంత్రం = కోహ్లీ భాయ్‌. అత్య‌ద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌` అని ర‌షీద్ ట్వీట్ చేశాడు. ఇలా రషీద్ ఖాన్ ట్విట్ చేసిన వెనువెంటనే అది కాస్తా వైరల్ గా మారింది. ఇప్పడు టాక్ అప్ ది స్టేడియంగా ఈ ట్విట్ మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  rashid khan  team india  south africa  zimbabwe  afganistan twitter  cricket  

Other Articles