Rahul Dravid questions disparity in cash prizes by BCCI బిసిసిఐ తీరుపై రాహుల్ ద్రావిడ్ అసహనం

Rahul dravid questions disparity in cash prizes by bcci says its not fair to others

INDvPAK, INDvsPAK, PAKvIND, PakvsInd, U19CWC, under19worldcup, U19WorldCup, Rahul Dravid, Twitter, Indias U-19 bahubali, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

India Under 19 coach Rahul Dravid questioned the disparity in cash prizes between him, the support staff and members of the team after wining the ICC Under 19 World Cup.

బిసిసిఐ తీరుపై రాహుల్ ద్రావిడ్ అసహనం

Posted: 02/06/2018 08:34 PM IST
Rahul dravid questions disparity in cash prizes by bcci says its not fair to others

అండర్‌-19 ప్రంపచకప్ ను గెలిచిన జగ్గజేతలుగా నిలిచిన భారత క్రికెట్‌ జట్టుకు ఇంకా ప్రశంసలు వెల్లివిరుస్తూనే వున్నాయి. అయితే జట్టు కోచ్, టీమిండియా వాల్ రాహుల్ ద్రావిడ్ మాత్రం జట్టు యాజమాన్యంపై కొంత అసహనంతో వున్నారు. అండర్ 19 జట్టు విశ్వవిజేతలుగా నిలిచినందుకు ఆ క్రెడిట్ అంతా రాహుల్ ద్రావిడ్ దేనని ఎంతో మంది కితాబిస్తున్న నేపథ్యంలో స్పందించిన రాహుల్ అది పూర్తిగా అటగాళ్లకు దక్కల్సిందేనని చెప్పారు. తాను ఎంత చెప్పినా.. దానిని మైదానంలో అమలుపర్చడంతోనే వారు విజయాన్ని అస్వాధించారని, దీంతో ఆ క్రెడిట్ పూర్తిగా వాళ్లకు దక్కాల్సిందేనని అన్నారు.

ఇక తాను ఎవరికన్నా ప్రత్యేకం కాదని, జట్టులో అందరిలో ఒకడని మాత్రమేనని చెప్పుకోచ్చే ద్రావిడ్.. తాజాగా జట్టు యాజమాన్యంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులోని ఆటగాళ్లతో పాటు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, సహాయ సిబ్బందికి బీసీసీఐ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. ఐతే ఈ నజరానాపై కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టులోని ఒక్కో ఆటగాడికి రూ.30లక్షలు, కోచ్‌ ద్రవిడ్‌కి రూ.50లక్షలు, ఒక్కో సహాయ సిబ్బందికి రూ.20లక్షల చొప్పున బీసీసీఐ ప్రకటించింది.

తనకు రూ.50లక్షలు, సహాయ సిబ్బందిలో ఒక్కొక్కరికీ రూ.20 లక్షలు ప్రకటించడంపై ద్రవిడ్‌ అసహనం వ్యక్తం చేశాడు. అందరూ కలిసి సమష్టిగా కష్టపడితేనే ఈ ప్రపంచకప్‌ దక్కింది. అంతేకానీ, నేనేమీ వారి కంటే ఎక్కువ కష్టపడలేదు. నాకంటే వారు తక్కువ కష్టపడలేదు. మన జట్టు ప్రపంచకప్ గెలిచినప్పటి నుంచి ఈ విషయం తాను చెబుతూనే ఉన్నానని అన్నారు. అలాంటప్పుడు బీసీసీఐ నజరానా విషయంలో ఎందుకు వ్యత్యాసం చూపించిందో తెలియడం లేదని ద్రవిడ్‌ అన్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : U19WorldCup  Rahul Dravid  BCCI  cash prizes  Indias U-19 bahubali  cricket  

Other Articles