Pujara Sets Unwanted Record in Centurion Test విరాట్ సేన కల చెదిరింది.. సిరీస్ చేజారింది..

India vs south africa 2nd test lungi ngidi s 6 39 guides sa to series win vs ind

India vs South Africa, India vs South Africa 2018, India vs South Africa, Virat Kohli,India vs South Africa, 2nd Test, Centurion, IND vs SA live score and updates, Indian national cricket team, Lungi Ngidi, Rohit Sharma, Jasprit Bumrah, sports news, sports, cricket news, cricket, today match, today match score, today match updates

Debutant Lungi Ngidi’s six-wicket haul helped South Africa thrash India by 135 runs in Centurion to claim an unassailable 2-0 lead in the three-match series.

విరాట్ సేన కల చెదిరింది.. సిరీస్ చేజారింది..

Posted: 01/17/2018 04:40 PM IST
India vs south africa 2nd test lungi ngidi s 6 39 guides sa to series win vs ind

ప్రపంచ రికార్డును అందుకోవాల్సిన తరుణంలో.. చెత్త రికార్డులను మూటగట్టుకుంది. విదేశీ గడ్డపై అందులోనూ పేస్ పిచులపై అడి తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తామని ధీమాను వ్యక్తం చేసి సఫారీ గడ్డపైకి వెళ్లిన టీమిండియా.. అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చింది. తొలి టెస్టులో ఎదురైన తప్పులను మరోమారు అనభవపూర్వకంగా రెండో టెస్టులోనూ చేసి మరో ఓటమిని మూటగట్టుకుంది. దీంతో చేజేతులా సిరీస్ ను సఫారీలకు అప్పగించింది.

రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 287 పరుగుల టార్గెట్‌ని చేరుకొని క్రమంలో టీం ఇండియా ఘోరంగా విఫలమైంది. సౌతాఫ్రికా పేసర్ల ధాటికి భారత ఆటగాళ్లు ఒకొక్కరిగా కుప్పకూలిపోయారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 151 పరుగులకే ఆలౌట్ కావడంతో సౌతాఫ్రికా 135 పరుగుల తేడాతో విజయం సాధించి టెస్ట్ సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.
 
తొలి ఇన్నింగ్స్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 335 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ భారీ ఆధిక్యంతో బరిలోకి దిగిన భారత జట్టు టాప్‌ఆర్డర్ ఆటగాళ్లు తడబడిన కెప్టెన్ విరాట్(153) ఒక్కడే నిలిచి జట్టుకు 307 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ఈ నేపథ్యంలో 28 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు నిలకడైన ఆటతో రెండో ఇన్నింగ్స్‌లో 258 పరుగులు చేసి 287 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ ముందుంచారు. అయితే భారత ఆటగాళ్లు మాత్రం ఆ టార్గెట్‌ను చేరుకోలేకపోయారు.

నాలుగో రోజు ఆటముగిసేసమయానికే 3 వికెట్లు కోల్పోయిన భారత జట్టు ఐదో రెండో భోజన విరామ సమయానికి ముందే ఆలౌట్ అయింది. భారత బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ(47) మినహా మిగితా ఆటగాళ్లు అందరూ.. స్వల్పస్కోర్‌కే పెవిలియన్ చేరారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 50.2 ఓవర్లు ఆడిన భారత్ జట్టు 151 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో ఎంగిడి 6, రబాడా 3 వికెట్లు తీశారు. తొలి మ్యాచ్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన లుంగి ఎంగిడికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles