ICC Test Rankings: Second Place to Kohli ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: 2వ స్థానంతో విరాట్ కోహ్తీ

Virat kohli moves to second place in icc test rankings

Cricket,Virat Kohli,ICC Test rankings,ICC player rankings,Steve Smith,Smith vs Kohli,India cricket rankings,Ricky Ponting,Virat Kohli vs Ricky Ponting,Indian cricket team,Latest cricket rankings,Matthew Hayden,Cricket news, sports news,sports, latest sports news, cricket news, cricket

Virat Kohli moved up to the second position in the latest Test rankings for batsmen released by the International Cricket Council

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్: 2వ స్థానంతో విరాట్ కోహ్తీ

Posted: 12/07/2017 08:56 PM IST
Virat kohli moves to second place in icc test rankings

టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ టెస్టు ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి(893 పాయింట్లు) ఎగబాకాడు. శ్రీలంకతో మూడో టెస్టుకు ముందు ఐదో స్థానంలో ఉన్న కోహ్లీ మూడో టెస్టు తరువాత ఏకంగా రెండోస్థానాన్ని అక్రమించాడు. డిల్లీలో జరిగిన టెస్టులో కోహ్లీ తొలి ఇన్నింగ్స్ లో ద్విశతకంతో పాటు రెండో ఇన్నింగ్స్ః లో అర్ధశతకం సాధించడంతో మూడు స్థానాలు ఎగబాకి రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. అంతకుముందు రెండో స్థానంలో ఉన్న భారత ఆటగాడు పుజారా తాజా ర్యాంకింగ్స్ లో రెండు స్థానాలు కోల్పోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

ఆస్ట్రేలియా సారథి స్టీవ్‌ స్మిత్‌ 938 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే లంక టెస్టు జట్టు సారథి దినేశ్ చండీమాల్ తన కెరీర్లో తొలిసారి టాప్‌-10లో చోటు దక్కించుకున్నాడు. 743 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతున్నాడు. భారత ఆటగాళ్లు మురళీ విజయ ‌(25), రోహిత్ శర్మ(40) తమ స్థానాలను మెరుగు పరుచుకున్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ మాత్రమే 2005-06 డిసెంబరు-జనవరి మధ్య అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్‌ స్థానాన్ని దక్కించుకున్నాడు. తర్వాత ఆసీస్ కే చెందిన మాథ్యూ హెడెన్ ఈ ఘనతను అందుకున్నాడు. భవిష్యత్తులో స్మిత్‌-కోహ్లిలో ఎవరో ఒకరు ఈ ఘనతను అందుకునేలా కనిపిస్తున్నారు.

శ్రీలంకతో టెస్టు సిరీస్ ద్వారా బౌలర్ల జాబితాలో తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటాడని భావించిన రవీంద్ర జడేజా ఒక స్థానంలో కోల్పోయి 870 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. మరో ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ ఆటగాడు జేమ్స్ అండర్సన్ బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్ రౌండర్ల జాబితాలోనూ జడేజా స్థానంలో ఎలాంటి మార్పులేకుండా తన రెండో స్థానంలోనే కొనసాగుతున్నాడు. ఇక జట్టు ర్యాంకింగ్స్‌ విషయానికి వస్తే శ్రీలంకపై 1-0తేడాతో సిరీస్‌ సొంతం చేసుకున్న భారత్ ఒక పాయింట్ కోల్పోయి 124 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  virat kohli record  steve smith  jadeja  ashwin  icc rankings  cricket rankings  cricket  

Other Articles