Pujara, jadeja rises to 2nd in latest ICC rankings బ్యాటింగ్లో పూజరా.. బౌలింగ్ లో జడేజా.. అదే ర్యాంక్

Pujara rises to 2nd kohli stays 5th in latest icc rankings

icc rankings, icc rankings batsmen, cheteshwar pujara, cricket rankings, virat kohli, ravindra jadeja, r ashwin, sports news,sports, latest sports news, cricket news, cricket

Cheteshwar Pujara - for the third time in his career - has leapfrogged to the second spot in the ICC Rankings for Test batsmen.

బ్యాటింగ్లో పూజరా.. బౌలింగ్ లో జడేజా.. అదే ర్యాంక్

Posted: 11/28/2017 08:39 PM IST
Pujara rises to 2nd kohli stays 5th in latest icc rankings

టీమిండియా నయావాల్ ఛెతేశ్వర్ పుజారా.. టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని దాటేసి ముందుకెళ్లాడు. ఐసీసీ టెస్టు బ్యాట్స్ మన్ ర్యాకింగ్స్ లో రెండో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 888 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. అతని తర్వాత ఉన్న నలుగురితో 11 పాయింట్లు అంతరమే ఉంది. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో పుజారా 143 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అదే మ్యాచులో ద్విశతకం బాదిన కెప్టెన్ కోహ్లీ 60 పాయింట్లు అదనంగా పొంది 877 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.

కాగా, యాషెస్ సిరీస్‌ తొలి టెస్టులో 141 పరుగులతో అజేయంగా నిలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ 941 పాయింట్లతో అగ్రస్థానంలో కోనసాగుతూ.. ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్‌, న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. డేవిడ్ వార్నర్ ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంకపై శతకాలు బాదిన మురళీ విజయ్‌, రోహిత్ 28, 46 ర్యాంకుల్లో ఉన్నారు. కేఎల్ రాహుల్ 9, అజింక్య రహానె 15, శిఖర్ ధావన్ 29 స్థానాల్లో ఉన్నారు. బౌలింగ్ విభాగంలో రవీంద్ర జడేజా రెండు, అశ్విన్‌ నాలుగో స్థానంలో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles