Kohli rested for three-match ODI series వన్డే సిరీస్ కు కెప్టెన్ గా రోహిత్ శర్మ..

Kohli rested for sri lanka odis rohit sharma named skipper

India vs Sri Lanka, Virat Kohli, Shikhar Dhawan, Rohit Sharma, Sidharth Kaul, Indian cricket team, cricket, sports news,sports, latest sports news, cricket news, cricket

Indian cricket team captain Virat Kohli has been rested for the upcoming ODI series against Sri Lanka, with Rohit Sharma set to lead the side in his absence

వన్డే సిరీస్ కు కెప్టెన్ గా రోహిత్ శర్మ..

Posted: 11/27/2017 08:01 PM IST
Kohli rested for sri lanka odis rohit sharma named skipper

పర్యాటక దేశం శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగిసి ముగియగానే వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఇప్పటికే భారతీయ క్రికెటర్లపై విపరీతమైన ఒత్తిడి వుందని తన అవేదనను వ్యక్తం చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి వన్డే సిరీస్ నుంచి మినహాయింపు ఇచ్చి.. విశ్రాంతి కల్పించారు. దీంతో మధ్య జరగనున్న మూడు వన్డేల సిరీస్ కు రోహిత్ శర్మ భారత కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది.

కోహ్లీ విశ్రాంతి కావాలని కోరడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కోనింది. అయితే శ్రీలంకతో డిసెంబరు 2 నుంచి ఢిల్లీలో జరగనున్న చివరిదైన మూడో టెస్ట్ కు మాత్రం కోహ్లీనే సారథ్యం వహించనున్నాడు. తీరిక లేని షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లు విశ్రాంతి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేయడంతో కేవలం తన కోసం మాత్రమే కాకుండా జట్టు సభ్యుల కోసం ఆయన వ్యక్తం చేసిన అవేదనను అయనకు మాత్రమే పరిమితం చేసిన బిసిసిఐ విశ్రాంతి కల్పించింది.
 
శ్రీలంకతో తలపడే భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధవన్, అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, ఎంఎస్ ధోనీ, హార్ధిక్ పాండ్యా, అక్సర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రిత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, సిద్దార్థ్ కౌల్.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles