Gayle and McCullum set to sizzle in BPL బంగ్లా ప్రీమియర్ లీగ్ లో పరుగుల సునామే..

Chris gayle and brendon mccullum are set to sizzle in the bpl

Chris Gayle, Brendon McCullum, Bangladesh Premier League, BPL, IPL, icc, cricket, cricket news, indian cricket news, sports news, latest sports news, latest cricket news, cricket

Gayle and ‘Bazz’ will soon be seen together playing for Rangpur Riders in the Bangladesh Premier League. It was earlier reported that McCullum will join the Riders from November 15th.

బంగ్లా ప్రీమియర్ లీగ్ లో పరుగుల సునామే..

Posted: 11/15/2017 07:12 PM IST
Chris gayle and brendon mccullum are set to sizzle in the bpl

ఆ ఇద్దరు విధ్వంసక బ్యాటింగ్‌ వీరులు మళ్లీ ఒకే జట్టుకు ఆడనున్నారు. ఈ దెబ్బతో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఈ దృశ్యం కనిపించబోతోంది. వెస్టిండీస్ వీరుడు క్రిస్ గేల ‌, న్యూజిలాండ్ బ్యాటింగ్ దిగ్గజం బ్రెండన్ మెక్ కలమ్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో రంగపుర్ రైడర్స్ తరఫున ఆడనున్నారు. వీరిద్దరూ త్వరలోనే జట్టులో చేరనున్నారు.

వీరి రాకతో ప్రత్యర్థులపై పైచేయి సాధించవచ్చని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ఇవాళ మెక్ కలమ్‌ జట్టులో చేరతాడని ఆశిస్తున్నారు. కాగా ఈ నెల 18న జరిగే మ్యాచులో వీరిద్దరూ కలిసి ఆడతారని అందరూ భావిస్తున్నారు. గతంలో ఈ జోడీ ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున బరిలోకి దిగారు. ‘టీ20ల్లో ప్రారంభమే అత్యంత కీలకం. ఇందులో మేం వెనకే ఉన్నాం. బ్యాట్స్ మెన్‌ మద్దతు లభిస్తే తర్వాత బౌలర్లకు పని సులభమవుతుంది’ అని రంగపుర్ జట్టు కోచ్ టామ్ మూడీ అన్నారు.

క్రిస్ గేల్‌, మెక్ కలమ్‌ జోడీ త్వరగా జట్టులో చేరితే బ్యాటింగ్ విభాగం బలపడుతుందని, సభ్యుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. ‘రెండు మూడు రోజుల్లో గేల్‌, మెక్‌కలమ్‌, కుశాల్‌ పెరీరా జట్టులో చేరతారు. మా టాప్‌ ఆర్డర్‌ పరుగులు చేయడంలో విఫలమవుతోంది. వారి రాకతో మళ్లీ పుంజుకుంటుంది’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chris Gayle  Brendon McCullum  Bangladesh Premier League  BPL  IPL  icc  cricket  

Other Articles