Vinay Kumar not giving up on comeback మళ్లీ జాతీయ జట్టులోకి వస్తానంటున్న పేసర్

Vinay kumar not giving up on indian national team comeback

Vinay kumar, Karnataka Ranji Team, ranji trophy, indian pacer, R Vinay Kumar, bcci, fitness, team india, indian cricket team, karnataka, cricket news, sports news, sports, latest sports news, cricket

R Vinay Kumar might be 33-years-old now, but hasn't stopped fancying his chances of representing the country once more.

మళ్లీ జాతీయ జట్టులోకి వస్తానంటున్న పేసర్

Posted: 11/11/2017 07:38 PM IST
Vinay kumar not giving up on indian national team comeback

టీమిండియా జాతీయ జట్టులోకి రావాలన్నదే తన ముందున్న ప్రథమ కర్తవ్యమని అందుకోసమే తాను నిత్యం శ్రమిస్తున్నానని అన్నాడు ఆర్ వినయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం కర్ణాటకకు చెందిన ఈ 33 ఏళ్ల తాను తిరిగి భారత క్రికెట్ జట్టులో స్థానం సంపాదించడం ఖాయమంటున్నాడు. ఇక్కడ సత్తా ఉండాలే కానీ వయసుతో సంబంధం లేదంటూ రీ ఎంట్రీపై ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒకే ఒక్క ఛాన్స్ వస్తే చాలు తనను నిరూపించుకుంటానంటూ స్పష్టం చేశాడు.

తాను ఫిట్ నెస్ ను నిరూపించుకునే పనిలో ఉన్నానని. అది కూడా జాతీయ జట్టులో పునరామనం చేసేందుకేనని.. ప్రస్తుతం తన పరిస్థితి ఏమిటో అనే విషయంలో పూర్తిగా స్పష్టత ఉందని అన్నాడు. బౌలర్లు ఎప్పుడు ఐదు వికెట్లు సాధించిన అది వారికి ఎక్కువ సంతోషాన్ని తీసుకొస్తుంది. తాను ఆ తరహా బౌలర్ని అని కచ్చితంగా చెప్పగలనన్నాడు. ఎవరైనా బ్యాట్స్ మెన్ కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసినప్పుడు వారి వికెట్ తీస్తే చాలా ఆనంద పడతనని చెప్పాడు.

గడిచిన మూడేళ్లలో బీసీసీఐ నుంచి రెండు అవార్డులు తీసుకున్నానని చెప్పుకోచ్చిన వినయ్.. 2014-15 రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన క్రమంలో అత్యుత్తమ బౌలర్ అవార్డును బీసీసీఐ నుంచి అందుకున్నానని చెప్పాడు. 2013-14 సీజన్ లో భాగంగా పరిమిత ఓవర్ల క్రికెట్ లో బెస్ట్ ఆల్ రౌండర్ అవార్డును కూడా అందుకున్నానని తెలిపాడు. ఇందువల్లే తాను తిరిగి భారత జట్టులోకి వస్తానని,  ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నా'అని వినయ్ కుమార్ తెలిపాడు. భారత్ జట్టులో 2013లో చివరిసారి కనిపించిన వినయ్ కుమార్..ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 430కి పైగా వికెట్లు సాధించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vinay kumar  bcci  fitness  team india  indian cricket team  karnataka  cricket  

Other Articles