Kapil Dev and MS Dhoni square off at Eden Gardens ఈడెన్ లో కపిల్, గంగూలీలతో కలసి ధోని పరీక్ష..

Ms dhoni inspects eden gardens strip despite test retirement

Cricket, ODI, India v/s Sri Lanka, Ind vs SL, Kolkatta, Sri Lanka, Virat Kohli, Ms Dhoni, kapil dev, saurav ganguly, KL Rahul, Karun Nair, Kedar Jadhav, Kuldeep Yadav, Yuzvendra Chahal, Hardik Pandya, sports news,sports, latest sports news, cricket news, cricket

Former indian skipper was seen analysing the Eden Gardens pitch ahead of the series opener agaianst Sri Lanka on November 16. Despite retiring from Test cricket long back,

ఈడెన్ లో కపిల్, గంగూలీలతో కలసి ధోని పరీక్ష..

Posted: 11/10/2017 06:47 PM IST
Ms dhoni inspects eden gardens strip despite test retirement

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కోల్ కతా వేదికగా భారత్ - శ్రీలంక జట్ల మధ్య ఈ నెల 16 నుంచి ఈడెన్ గార్డెన్స్ లో జరగనున్న టెస్టు మ్యాచ్ లో ఆయన పరీక్ష చేశారు. అదేంటి టెస్టు క్రికెట్ నుంచి దాదాపు మూడేళ్ల క్రితం రిటైర్మెంట్ ప్రకటించిన ఎంఎస్ ధోని ఈడెన్ గార్డెన్స్ లో పరీక్షను ఎందుకు చేశాడు అంటారా..? అసలు అయనకు టెస్టు క్రికెట్ తో సంబంధమేమిటీ అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయా..? 2014లో అస్ట్రేలియాతో సిరీస్ ను ముగించిన వెనువెంటనే ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన టెస్టులకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.

అప్పటికే సుమారుగా.. 90 టెస్టు మ్యాచ్ ల్లో 4,876 పరుగులు చేసిన ధోనికి లంకతో జరిగే టెస్టుకు ఈడెన్ కు ఎందుకు చేరుకున్నాడు, పిచ్ ను ఎందుకు పరీక్షించాడు అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నయా..? టెస్టులకు వీడ్కోలు పలికిన ఆయన తనకు సంబంధం లేదని వెళ్లకుండా ఈడెన్ కు వచ్చిన సందర్భంగా గ్రౌండ్ క్యూరేటర్ సుజాన్ ముఖర్జీతో కలసి ముచ్చటించి.. పిచ్ తయారీపై వివరాలను అడిగి తెలుసుకున్నాడు. ఇది ఆయనలోని క్రికెట్ పై వున్న మక్కువను, అసక్తిని తెలియజేస్తుంది.

దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌ దేవ్, మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఒక వ్యాపార ప్రకటన కోసం ఈడెన్ కు వచ్చారు. దీనిలో భాగంగా 58 ఏళ్ల కపిల్‌ తనదైన శైలిలో బౌలింగ్‌ చేయగా... 36 ఏళ్ల ధోని తన బ్యాటింగ్‌ ప్రత్యేకతను ప్రదర్శిస్తూ ఈడెన్ గార్డెన్ లో షూటింగ్ లో పాల్గొన్నాడు. దీనికి క్యాబ్ (క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అనుమతి ఇవ్వడంతో ఇక్కడ షూటింగ్ జరిగింది. షూటింగ్ విరామ సమయంలో ధోని పిచ్ వద్దకు వెళ్లి పరిశీలించి.. వివరాలు అడిగి తెలుసుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Sri Lanka  Ind vs SL  kolkatta  Virat Kohli  Ms Dhoni  kapil dev  saurav ganguly  cricket  

Other Articles