India vs Australia, 3rd T20 Match called off నిర్ణయాత్మక మ్యాచ్ రద్దుపై అభిమానుల ఫైర్..

Twitter slams bcci as virat kohli s india vs australia hyderabad t20 called off

cricket score, india vs australia, india vs australia 2017, india vs australia, india vs australia 2nd t20, ind vs aus, ind vs aus odi, india vs australia odi score, india vs australia match, india vs australia cricket score, hyderabad t20 match, cricket

Twenty20 series between India and Australia was called off due to the wet outfield at the Rajiv Gandhi International Cricket Stadium, which played spoilsport on the third T20 .

నిర్ణయాత్మక మ్యాచ్ రద్దుపై అభిమానుల ఫైర్.. హెచ్ సీఏపై విమర్శలు

Posted: 10/14/2017 11:57 AM IST
Twitter slams bcci as virat kohli s india vs australia hyderabad t20 called off

అస్ట్రేలియా- టీమిండియా మధ్య జరగాల్సిన నిర్ణయాత్మక చివరి టీ20 రద్దుతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర అప్రదిష్టను మూటగట్టుకుంది. తమ గ్రౌండ్ లో అడించే అవకాశాల కోసం ఆయా స్టేడియం యాజమాన్యాలు వేయికళ్లతో ఎదురుచూస్తుండగా, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక నిర్లక్ష్యంగా వ్యవహరించింది హెచ్ సీ ఏ. రోజంతా చినుకు లేకపోయినా.. ఎండ కాచినా.. మ్యాచ్ సమయానికి స్టేడియాన్ని సిద్దం చేయలేక నెట్ జనులు నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది.

కీలకమైన నిర్ణయాత్మకమైన మ్యాచ్ కు వేదికగా నిలుస్తుందని అనేక వ్యవప్రయాసలకోర్చి టిక్కెట్ సాధించిన అభిమానులతో పాటు మ్యాచ్ ను అసక్తిగా చూసేందుకు టీవీలకు అతక్కుపోయి నిరీక్షించిన అభిమానులందరూ హెచ్ సి ఏ ఘనఖ్యాతిని వేనోళ్ల ప్రశంసిస్తున్నారు. అభిమాన క్రీడాకారులను చూసేందుకు తరలివచ్చిన వేలాది మందికి నిరాశేకు గురయ్యారు. స్టేడియంలోని పిచ్ పై కవర్లు కప్పిన సిబ్బంది.. ఔట్ ఫీల్డ్పై మాత్రం అశ్రద్దను కనబర్చారు.

దీంతో ఉప్పల్‌ ఔట్‌ ఫీల్డ్‌ బురదమయంగా మారింది. సిబ్బంది అప్పటకప్పుడు చెక్క పోడిని చల్లినా అది నిష్ప్రయోజనంగా మారింది. సిబ్బంది ఎన్ని ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నా అన్నీ విఫలమయ్యాయి. ఈ క్రమంలో ఉప్పల్ స్టేడియంలోని ఔట్ ఫీల్డ్ ను పలుమార్లు పరిశీలించిన అంపైర్లు చివరికి మ్యాచును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో ఉప్పల్ మైదాన నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేశారు.

‘హెచ్‌సీఏ మౌలిక సదుపాయాలను కల్పించడంలో విఫలమైంది. నిర్వాహకులు మ్యాచ్‌ను నిర్వహించడంలో విఫలమయ్యారు. వారికి అసలు క్రికెట్‌పై ఆసక్తే లేదు, వర్షం లేకపోయినా మ్యాచ్‌ రద్దవడం హాస్యాస్పదం, హెచ్‌సీఏకు కావాలంటే ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానాన్ని కప్పి ఉంచే కవర్లను అందజేస్తాం. బీసీసీఐ ప్రతినిధులు దయచేసి అలాంటి కవర్లను హైదరాబాద్‌ స్టేడియం నిర్వాహకులకు కొనిపెట్టండి’ అంటూ నెటిజన్లు మండిపడ్డారు.

రాంచీలో జరిగిన తొలి టీ20లో భారత్‌ విజయం సాధించగా.. గువాహటిలో జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌ సేన గెలిచింది. దీంతో చివరి టీ20 మ్యాచ్‌ నిర్ణయాత్మకంగా మారింది. అలాంటి మ్యాచ్‌ను హైదరాబాద్‌ నిర్వహించలేకపోయింది. మైదానంలో చాలా ప్రాంతాలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడం, కొద్ది ప్రాంతాలు చిత్తడిగా ఉండటం, బంతి పైకి లేచే అవకాశమే లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. అంతర్జాతీయ టీ20కి ఆతిథ్యమివ్వడం హైదరాబాద్‌కి ఇదే తొలిసారి. తొలి ప్రయత్నంలోనే హైదరాబాద్‌ ఫెయిలయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs australia  guwahati  Team India  virat kohli  Australia  hyderabad  T20 match  cricket  

Other Articles