Dhoni Records Personal Highest Speed ధోని పరుగెత్తితే.. చిరత కూడా ఓడిపోద్దీ..

Ms dhoni records personal highest speed during 2nd t20i

Team India, Australia, T20, guwahati, India vs Australia, MS Dhoni, Virat Kohli, India, dhoni speed, India vs Australia 2017, India vs Australia 2nd T20I, dhoni running, Indian Cricket Team, latest cricket new, sports news, cricket news, sports, cricket

In the second T20I against Australia, Dhoni once again showed that age is just a number by clocking his personal highest speed of 31 km/h while running a double during the match.

ధోని పరుగెత్తితే.. చిరత కూడా ఓడిపోద్దీ..

Posted: 10/13/2017 06:16 PM IST
Ms dhoni records personal highest speed during 2nd t20i

క్రికెటర్లు అటలో రనౌట్ అయితే అభిమానులే ముందుగా కోపగించుకుంటారు. అంత అవసరమా..? అంటూ అడిపోసుకుంటారు. కానీ ఆటలో వారు ఎంతటి వేగంతో పరిగెడతారో తెలిస్తే.. అశ్చర్యపోక తప్పదు. అక్టోబ‌ర్ 11న గువ‌హ‌టి వేదికగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన రెండో టీ20 అంత‌ర్జాతీయ మ్యాచులో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ స్టన్నింగ్ ర‌న్నింగ్ రికార్డు నెల‌కొల్పారు. ఆయన ఆటలో భాగంగా తీసిన రెండో పరుగు కోసం పరుగెత్తిన తీరు చిరుత కూడా చిన్నబుచ్చుకుంటుందని చెప్పడం అతిశయోక్తి కాదు. పరుగుల వీరుడు బోల్ట్ కూడా వెనుకబడిపోతాడంటూ నమ్మాల్సిందే.

ఎందుకంటే మ్యాచులో రెండో ర‌న్ కోసం గంట‌కు 31 కి.మీ.ల వేగంతో ధోని ప‌రిగెత్తాడు. ధోనీ ర‌న్నింగ్ విశ్లేష‌ణ వీడియోను స్టార్ స్పోర్ట్స్ ట్వీట్ చేసింది. `ధోనీ ర‌న్నింగ్‌ రికార్డును ఎవ‌రూ బ్రేక్ చేయ‌లేరు` అంటూ స్టార్ స్పోర్ట్స్ పోస్ట్ చేసింది. దీనికి నెటిజ‌న్లు ఏకీభ‌విస్తూ వివిధ ర‌కాలుగా స్పందించారు. `ధోనీ బుల్లెట్ ట్రెయిన్ కంటే ఫాస్ట్‌`, `ధోనీ రికార్డు సృష్టిస్తే అంతే ఇక‌.. దాన్ని ఎవ‌రూ దాట‌లేరు` అంటూ కామెంట్ చేశారు. ఇటీవ‌ల ఆగ‌స్టులో నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీని సంద‌ర్శించిన‌పుడు 20 మీట‌ర్ల రేస్‌ను 2.91 సెక‌న్ల‌లో ధోని పూర్తి చేసిన సంగ‌తి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team India  Australia  T20  guwahati  India vs Australia  MS Dhoni  Virat Kohli  Cricket  

Other Articles