ICC to approve Test championship, report says త్వరలో టెస్టు ఛాంఫియన్ షిఫ్.. అమోదించనున్న ఐసీసీ

International cricket council set to approve test championship says report

International Cricket Council, cricket, ICC, Test cricket, Twenty20, World Test Championship, ODI, IPL

The International Cricket Council wants Test cricket to be the pinnacle among all three formats of the game. India are the No. 1 Test team in the world.

త్వరలో టెస్టు ఛాంఫియన్ షిఫ్.. అమోదించనున్న ఐసీసీ

Posted: 10/09/2017 07:17 PM IST
International cricket council set to approve test championship says report

ఫలితం తేలడానికి దాదాపుగా నాలుగు నుంచి ఐదు రోజుల సమయం పడుతుండంతో అభిమానుల్లో ఆసక్తి తగ్గిపోయి.. అదరణకు కొంత దూరంగా వెళ్తున్న టెస్టు క్రికెట్ ను మళ్లీ అభిమానుల చెరువ చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది అంతర్జాతీయ క్రికెట్ మండలి. ఇందుకోసం దాదాపు ఏడాది కాలంగా టెస్టు ఫార్మాట్ కు కొత్త రూపు తేవాలకుంటున్న ఐసీసీ ఎట్టకేలకు సరికొత్త కార్యాచరణ రూపొందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.  

అభిమానులకు టెస్టు క్రికెట్ ను చేరువ చేసేందుకు ప్రణాళిక రచించిన ఐసీసీ.. అభిమానులు తప్పకుండా ఫాలో అయ్యేందుకు టెస్టు లో కూడా వినూత్న తరహా కాంపిటీషన్ తీసుకురావాలని వ్యూహం రచించింది. దీంతో పరిమితి ఓవర్ల సిరీస్ తరహాలోనే ఇకపై టెస్టు సిరీస్ లలో కూడా చాంపియన్ షిప్ టోర్నీలు, ప్రపంచ కప్  ఇక నుంచి టెస్టుల్లో కూడా కనువిందు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే టెస్టు చాంపియన్ షిప్ నిర్వహించేందుకు ICC గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ఏడాది కాలంగా ఐదు రోజుల పాటు జరిగే టెస్టు మ్యాచ్ లకు ప్రోత్సహించాలని స్పోర్ట్స్ గవర్నింగ్ బాడీ ఆలోచన. అయితే దానికి ఎట్టకేలకు ముగింపు పడినట్లు తెలుస్తోంది. అందుకు సుముఖత వ్యక్తం చేసిన ICC..టెస్టు చాంపియన్ టోర్నీకి ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో టెస్టు హోదా కల్గిన 9దేశాలు పాల్గొననున్నాయి. ఆక్లాండ్ లో శుక్రవారం (అక్టోబర్-6) జరిగిన మీటింగ్ లోనే టెస్టుల్లో కొత్త విధానానికి ICC శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. టెస్టు చాంపియన్ షిప్ నిర్వహణకు మరో రెండేళ్లు సమయం పట్టే అవకాశం ఉంది. 2019 లో మొదటి ఎడిషన్ రూపొందించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. లాడ్స్ లో ఫైనల్ మ్యాచ్ నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : International Cricket Council  cricket  ICC  Test cricket  Twenty20  World Test Championship  ODI  IPL  

Other Articles