Danushka Gunathilaka suspended for six games | ప్రాక్టీస్ వదిలి పార్టీలకెళ్లాడు.. బ్యాన్ విధించారు

Sri lanka cricket bans danushka for six games

Danushka Gunathilake, Srilanka Cricket Board, Danushka Gunathilake Suspended, Danushka Gunathilake Behaviour, Danushka Gunathilake Controversy

Sri Lanka Cricket Bans Danushka Gunathilake For Breach Of Discipline. Danushka suspended for six games.

లంక ప్లేయర్ పై 6 మ్యాచ్ ల నిషేధం

Posted: 10/05/2017 06:44 PM IST
Sri lanka cricket bans danushka for six games

భారత్ తో సిరీస్ సందర్భంగా తీవ్ర విమర్శలపాలైన శ్రీలంక క్రికెట్ ఆటగాళ్ల వ్యవహార శైలిపై ఈ మధ్య తెగ విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా యువ ఆటగాడు ధనుష్క గుణతిలకపై ఆరు మ్యాచ్ ల నిషేధం విధిస్తూ లంక బోర్డు నిర్ణయం తీసుకుంది.వ్యక్తిగత ప్రవర్తన సరిగ్గా లేకపోవటంతోనే అతనిపై వేటు వేసినట్లు బోర్డు ప్రకటించింది.

ప్రాక్టీస్ సెషన్ ఎగ్గొట్టడమే కాకుండా ఓ నైట్ పార్టీలో ఎక్కువ సమయం గడిపాడన్న ఆరోపణలు ధనుష్కపై వినిపించాయి. ఈ మేరకు విచారణ జరిపిన బోర్డు నిషేధం నిర్ణయం తీసుకుంది. కాగా, ప్రస్తుతం శ్రీలంక జట్టు యూఏఈ వేదికగా పాకిస్థాన్ తో టెస్టు సిరీస్ ఆడుతోంది. తొలి టెస్టులో శ్రీలంక జట్టు విజయం సాధించింది. రెండో టెస్టు రేపటి నుంచి ప్రారంభం కానుంది. నిషేధం కారణంతో రెండో టెస్టు నుంచే గుణతిలక ఆటకు దూరం కానున్నాడు.

ఇదిలా ఉండగా, శ్రీలంక క్రికెట్ బోర్డు నిబంధనలను గుణతిలక ఉల్లంఘించడం ఇదేమీ తొలిసారి కాదు. శ్రీలంక- భారత్ జట్ల మధ్య ఇటీవల జరిగిన ఓ మ్యాచ్ కు తన బ్యాటింగ్ కిట్ ను గుణతిలక మర్చిపోయి రావడం విమర్శలకు దారితీసింది. ఆ సందర్భంలో బోర్డు అతన్ని కేవలం మందలించి వదిలిపెట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles