It's Too Early to Compare Hardik Pandya With Kapil Dev అప్పుడే పాండ్యను అ లెజండరీ క్రికెటర్ తో పొల్చలేం..

Hardik pandya is a fighter but it s too early to compare him with kapil dev

India vs australia, Team India, Record win, virat kohli, Hardik Pandya, sourav ganguly, kapil dev, legendary cricketer, allrounder, T20 Series, ashish nehra, Jasprit Bumrah, Bhuvneshwar Kumar, australia vs india, cricket news, sports news, sports, cricket

Former India skipper Sourav Ganguly said even though Pandya is a great all-rounder, but he shouldn't be compared with Kapil Devi just yet.

అప్పుడే పాండ్యను అ లెజండరీ క్రికెటర్ తో పొల్చలేం..

Posted: 10/04/2017 08:01 PM IST
Hardik pandya is a fighter but it s too early to compare him with kapil dev

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను ఇప్పుడే లెజెండ్‌ ఆల్‌రౌండర్‌ కపిల్‌దేవ్‌తో పోల్చవద్దని మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన పాండ్యా మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ తో పాటు అభిమానుల, మాజీ క్రికెటర్ల ప్రశంసలందుకుంటున్న విషయం తెలిసిందే. కొందరు ఔత్సాహికులు అయితే పాండ్యాను కపిల్‌తో పొలుస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదా ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై స్పందించారు.

‘పాండ్యా ప్రదర్శరనతో కోహ్లిసేన విజయం సాధించవచ్చు.కానీ 15 ఏళ్లు రాణించిన గొప్ప చాంపియన్‌ కపిల్‌దేవ్‌తో ఇప్పుడే పోల్చడం సరికాదు. పాండ్యా ఇప్పుడిప్పుడే రాణిస్తున్నాడు. పాండ్యా ఓ మంచి క్రికెటర్‌, తన ఆటను ఆస్వాదించనివ్వండి. ఇలానే భవిష్యత్తులో రాణించాలని ఆశిస్తున్నా అని’ గంగూలీ పేర్కొన్నారు.

ఇక టీ20 మ్యాచ్‌లకు సీనియర్‌ ఆటగాడైన ఆశిష్‌ నెహ్రా ఎంపిక చేయడం పట్ల దాదా సెలక్టర్లను ప్రశంసించారు. వయస్సుతో సంబంధం లేకుండా నెహ్రాను ఎంపిక చేయడం భారత క్రికెట్‌కు మంచి పరిణామమన్నారు. నెహ్రా అనుభవం ఉన్న టీ20 బౌలర్‌ అని చెప్పుకొచ్చిన దాదా అతని సత్తా ఏమిటో గత టీ20 వరల్డ్‌క ప్‌లో చూశామన్నారు. అతను ఏడమ చేతి బౌలర్‌ అని, దీంతో భిన్న కోణాల్లో బంతులు విసరగలడని తెలిపారు. ఈ సిరీస్‌లో అతను అద్భుతంగా రాణిస్తాడని దాదా ధీమా వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles