Bumrah, Bhuvi are best death bowlers says Smith వాళిద్దరే మా ప్రణాళికను దెబ్బతీశారు..

Bumrah bhuvneshwar kumar are best death bowlers around steve smith

India vs australia, Team India, Record win, virat kohli, steve smith, bhuvneshwar kumar, jasprit bumrah, india cricket team, India v Australia,Bumrah,Steve Smith,Smith,Pandya,Jasprit Bumrah,Bhuvneshwar Kumar,Bhuvneshwar,Adam Zampa, australia vs india, cricket news, sports news, sports, cricket

Australia skipper Steve Smith has described Jasprit Bumrah and Bhuvneshwar Kumar as currently the best death bowlers after his team suffered a five-wicket loss in the third ODI.

వాళిద్దరే మా ప్రణాళికను దెబ్బతీశారు..

Posted: 09/25/2017 06:10 PM IST
Bumrah bhuvneshwar kumar are best death bowlers around steve smith

టీమిండియాతో ఇండోర్ వేదికగా జరిగిన అత్యంక కీలకమైన మూడో వన్డేలో భారీ స్కోరు చేసి టీమిండియా ముంగిట లక్ష్యంగా పెట్టాలనుకున్న తమ ప్రణాళికను ఆ ఇద్దరు అటగాళ్లు దెబ్బతీశారని అసీస్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మీత్ అన్నారు. ఇంతకీ వారిద్దరు ఎవరంటారా..?  టీమిండియా ప్రధాన పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బూమ్రాలే. తమ జట్టు భారీ స్కోరును చేయకుండా నియంత్రించడంలో వారిద్దరూ సఫలమయ్యారని అన్నాడు.

ప్రస్తుతం వున్న మేటి బౌటర్లలో వీరిద్దరూ ఉత్తమ డెత్ బౌలర్లలని ఆయన కితాబిచ్చాడు. వీరిద్దరూ తమ జట్టు అటగాళ్లకు ఏ దశలోనూ పరుగులు చేసే అవకాశాన్ని ఇవ్వలేదన్నాడు. ప్రధానంగా స్లాగ్ ఓవర్లలో ఆ ఇద్దరి బౌలింగ్ లో పరుగులు రాబట్టడానికి ఆసీస్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందన్నాడు. ఇక పరుగులు రాబట్టేందుకు తమ బ్యాట్స్ మెన్లు తప్పుడు షాట్లకు వెళ్లాల్సివచ్చిందని దీంతోనే గేమ్ ప్లాన్ చేంజ్ అయ్యిందని స్మిట్ అన్నాడు.

ఇక్కడ చెడ్డ బంతుల్లో వికెట్లను సమర్పించుకోవడం బాధను మిగిల్చిందని అన్నాడు. నిన్నటి మ్యాచ్ గెలవడంలో టీమిండియా బౌలింగ్ మాత్రమే కారణమని, భారత్ బౌలింగ్ అద్భుతంగా ఉందని అన్నాడు. బూమ్రా, భువీ ఇద్దరి వల్లే మా ప్లాన్ పూర్తిగా దెబ్బతిందని అన్నాడు. మమ్మల్సి సులువుగా పరుగులు తీయకుండా నియంత్రించడంలో వీరిద్దరూ సఫలం చెందారు. దాంతో దూకుడుడా ఆడాల్సి వచ్చింది. వారిద్దరూ అత్యుత్తమ డెత్ ఓవర్ల స్పెషలిస్టులని స్మిత్ పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles