భారత చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అసీస్ వైస్ కెప్టెన్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను పడగొట్టిన సందర్భంగా మిగిలిన నాలుగు మ్యాచులలో మరోమారు కూడా వార్నర్ వికెట్ ను తీసుకుంటానని ధీమా వ్యక్తం చేయడంపై స్పందించిన వార్నర్ నిస్సందేహంగా కుల్దీప్ యాదవ్ మంచి బౌలర్ అని కితాబిచ్చాడు. అయితే అతన్ని ఎదుర్కోవడంలో తాను ఎలాంటి ఒత్తడిని ఎదుర్కోవడం లేదని స్పష్టం చేసిన వార్నర్.. అసలు ఒత్తడి కుల్దీప్ పైనే వుంటుందని స్పష్టం చేశారు.
కెరీర్ తొలి దశల్లో ఉన్న కుల్దీప్ పైనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, నా కెరీర్ ప్రారంభంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందని వార్నర్ అభిప్రాయపడ్డారు. కానీ కుల్దీప్ దైర్యం ఆకట్టుకుందని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపాడు. కొల్ కతా వేదికగా జరిగిన రెండో వన్డేలో కుల్దీప్ హ్యాట్రిక్ సాధించడాన్ని ప్రశంసించిన వార్నర్ రాబోయే రోజుల్లో అయన గొప్ప బౌలర్ అవుతాడని కితాబిచ్చారు. ఇక కుల్దీప్ వరుస బంతుల్లో వేడ్, అగర్, ప్యాట్ కమ్మిన్స్ లను అవుట్ చేసి వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారత స్పిన్నర్ గా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
అయితే చెన్నై వేదికగా జరిగిన తొలి వన్డేలో వార్నర్.. కల్దీప్ బౌలింగ్ లోనే అవుటయ్యాడు. రెండో వన్డేలో మాత్రం ఆరంభంలోనే భువనేశ్వర్ బౌలింగ్ లో అవుటవ్వడంతో కుల్దీప్ బంతులను ఎదుర్కొనే అవకాశం రాలేదు. ఇక వార్నర్ మాటలను బట్టి అతడు కుల్దీప్ బౌలింగ్ ఎదుర్కోవడానికి ఎంత దిగులు చెందుతున్నడో అతని మాటల్లోనే వ్యక్తమవుతుంది. ఈ చైనామన్ తన ధర్మశాల అరంగేట్ర మ్యాచ్ లోనే వార్నర్ వికెట్ పడగొట్టాడు. ఇక వార్నర్ కు బంతులేయడాన్ని ఆస్వాదిస్తానని కుల్దీప్ చెప్పుకొచ్చాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more