JP Duminy retires from Test cricket టెస్టు క్రికెట్ కు జేపీ డుమిని వీడ్కోలు

Jp duminy announces retirement from test and first class cricket

JP Duminy, South Africa national cricket team, Delhi Daredevils, Cricket, All-rounder, Faf du Plessis, Test cricket, Cricket news, cricket news, cricket, sports news, latest news

JP Duminy, who played 46 Tests for South Africa since 2008, announced his retirement from the longer format of the game ahead of South Africa’s series against Bangladesh.

టెస్టు క్రికెట్ కు జేపీ డుమిని వీడ్కోలు

Posted: 09/16/2017 04:40 PM IST
Jp duminy announces retirement from test and first class cricket

దక్షిణాఫ్రికా అల్ రౌండర్ జేపీ డుమిని సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు క్రికెట్ నుంచి ఆయన వీడ్కోలు తీసుకున్నాడు. అంతేకాదు ఓ వైపు టెస్టులలో అడనంటూ ప్రకటించిన ఆయన మరోవైపు ఫస్ట్ క్లాస్ క్రికెట్ సైతం గుడ్ బై చెప్పాడు. ఇప్పటి వరకు 46 టెస్టులాడిన డుమిని 74 ఇన్నింగ్స్‌ల్లో 2,103 పరుగులు సాధించాడు. టెస్టు క్రికెట్‌ని ఎంతో ఉత్సాహంగా అడానని చెప్పిన డుమిని, దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు.

పరిమిత ఓవర్ల క్రికెట్‌పై ఎక్కువ దృష్టి పెట్టేందుకే టెస్టు క్రికెట్ కు గుడ్‌బై చెప్పినట్లు డుమిని తెలిపాడు. అయితే గత కొంతకాలంగా ఆయన టెస్టు క్రికెట్ లో అశించిన స్థాయిలో రాణించ లేకపోవడం కూడా ఆ నిర్ణయం వెనుక కారణమై వుండవచ్చునని తెలుస్తుంది. ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ నేపథ్యమే డుమిని వీడ్కోలుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ సిరీస్ లో తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లో కలసి ఆయన కేవలం 17 పరుగులు మాత్రమే సాధించడంతో జట్టులో స్థానం కొల్పోయాడు.

దీంతో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకిందుకు ఇదే సరైన సమయమని భావించిన డుమిని ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ కు కూడా గుడ్ బై చెప్పాడు,
2008లో ఆస్ట్రేలియాపై డుమిని టెస్టుల్లో అడుగుపెట్టాడు. టెస్టుల్లో అతని వ్యక్తిగత అత్యధిక స్కోరు 166 పరుగులను ఆసీస్‌పైనే సాధించాడు. 108 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లాడిన డుమిని 6,774 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో డెక్కన్‌ ఛార్జర్స్‌, దిల్లీ డేర్‌డెవిల్స్‌, ముంబయి ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles