Dhoni fans troll chief selector for ‘alternative’ comment ఎంఎస్కే ప్రసాద్ పై మండిపడుతున్న ధోని అభిమానులు..

Ms dhoni fans troll chief selector msk prasad for alternative comment

MS Dhoni, MSK Prasad, India vs Sri Lanka, Dhoni fans, alternative, yuvraj singh, Team India, chief selector, sports news, cricket, news, sports news, sports, cricket, latest cricket news, latest sports news

chief selector MSK Prasad made it clear that the board will have to think of new alternatives if Mahendra Singh Dhoni doesn’t perform on a consistent basis.

ఎంఎస్కే ప్రసాద్ పై మండిపడుతున్న ధోని అభిమానులు..

Posted: 08/29/2017 08:53 PM IST
Ms dhoni fans troll chief selector msk prasad for alternative comment

బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌పై టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ లో ధోని అడుతున్న తీరు చూస్తున్నావా లేదా.. ? ఎంఎస్కే అంటూ నెట్ జనులు దెప్పిపొడిచారు. ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్ ను శ్రీలంకతో వన్డే సిరీస్ కు ఎంపిక చేయలేదు. దీంతో ఇక ఆయన టీమిండియాలో స్థానం సంపాదించడం కష్టమేనని అందరూ భావిస్తున్నారు.. దీనికి మీరేంమంటారు అని ఎంఎస్కేనేు మీడియా ప్రశ్నించింది.

దానికి స్పందించిన ఎంఎస్కే యువరాజ్ సింగ్ కు అవకాశాలు సన్నగిల్లినట్లేనన్న వాదనను తోసిపుచ్చాడు. అతనికి కేవలం విశ్రాంతి కల్పించామంతే నని అన్నారు. అతను టీమిండియా జట్టులోకి వచ్చేందుకు ద్వారలు ఇంకా తెరిచేవున్నాయని చెప్పుకోచ్చారు. శ్రీలంక సిరీస్ కు వన్డే జట్టు ఎంపిక చేసే సందర్భంగా యువీ, ధోనీ గురించి చర్చించామని వెల్లడించారు. అయితే ఆశించిన స్థాయిలో ధోని శ్రీలంకతో రాణించలేని పక్షంలో అయనకు ప్రత్యామ్నాయం తప్పదని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలపై ఆగ్రహించిన ధోనీ అభిమానులు ఎమ్మెస్కేపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు చేశారు. శ్రీలంకతో రెండో వన్డేలో భువితో, మూడో వన్డేలో రోహిత్‌శర్మతో కలిసి మహీ మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. నాటౌట్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా ‘ధోనీ ఆటను చూస్తున్నారా మీరు’, ‘కొందరు మాట్లాడతారు.. కొందరు చేతలతో సమాధానం చెప్తారు’ అంటూ ఎమ్మెస్కేపై ధోనీ అభిమానులు ఫైర్‌ అవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  India vs Sri Lanka  dhoni 50 runs  Team India  chief selector  MSK Prasad  cricket  

Other Articles