Gayle, Sehwag to play T10 league in UAE టీ20 తరహాలోనే టీ10 టోర్నీ.. దుబాయ్ వేదికగా..

Virender sehwag chris gayle to play in first ever t10 cricket league

Ten Cricket League, Virender Sehwag, Shahid Afridi, Kumar Sangakkara, Chris Gayle, Shaji ul Mulk, india cricket team, cricket news, sports news, sports, cricket

Virender Sehwag, Chris Gayle, Shahid Afridi and Kumar Sangakkara will be part of the T10 league, named Ten Cricket League, in the UAE.

టీ20 తరహాలోనే టీ10 టోర్నీ.. దుబాయ్ వేదికగా..

Posted: 08/23/2017 08:06 PM IST
Virender sehwag chris gayle to play in first ever t10 cricket league

భారత క్రికెట్‌ మాజీ ఓపెనర్.. డాషింగ్ బ్యాట్స్ మెన్ గా పేరొందిన వీరేంద్ర సెహ్వాగ్‌ మరోసారి బ్యాట్‌ అందుకుని పరుగులు కోసం వేట కొనసాగించనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వీడ్కోలు తీసుకున్న తరువాత ఆ మధ్య సచిన్ టెండుల్కర్ నేతృత్వంలోని వెటరన్స్ కప్ లో పరుగులు సాధించిన సెహ్వాగ్ మళ్లీ బ్యాట్ చేతబట్టి పరుగులు సాధించడమేంటని అనుకుంటున్నారా..? కానీ ఇది నిజమే. యూఏఈలో డిసెంబరు 21 నుంచి 24 మధ్య టీ10 లీగ్‌ జరగనుంది. ఈ టోర్నీ కోసం సెహ్వాగ్‌ బ్యాట్‌ పట్టనున్నాడు.

టీ20 తరహాలోనే టీ10 ఫార్మాట్ కు దుబాయ్ వేదిక కానుంది. ఒక్కో మ్యాచ్‌ నిర్వహణకు సుమారు 90నిమిషాల సమయం కేటాయిస్తున్నారు. ఈ మ్యాచ్ లలో దక్షిణ ఆసియా నుంచి మాజీ, ప్రస్తుత క్రికెటర్లతో పాటు సెలబ్రెటీలు హాజరుకానున్నారు. వీరేంద్ర సెహ్వాగ్‌, షాహిద్‌ అఫ్రిది, క్రిస్‌గేల్‌, కుమార సంగక్కర తదితరులు ఈ టోర్నీలో బరిలో దిగనున్నారు. పంజాబీస్‌, మరాఠాస్‌, బంగ్లాస్‌, లంకన్స్‌, సింధీస్‌, కేరళిటీస్‌, పఖ్తూన్స్‌గా జట్ల పేర్లను ప్రకటించారు. పఖ్తూన్స్‌ జట్టుకి అఫ్రిది నాయకత్వం వహించనున్నాడు. యూఏఈలోని షార్జా క్రికెట్‌ మైదానంలో మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ten Cricket League  Virender Sehwag  Shahid Afridi  Kumar Sangakkara  Chris Gayle  cricket  

Other Articles