Kohli eye personal milestone in second ODI రెండో వన్డేలో.. రెండు మైలురాళ్లపై విరాట్ నజర్..

Virat kohli eye personal milestone in second odi

Virat Kohli, Virat Kohli, vandes, Faf Du Plessis, MS dhoni, stumpings, lasith malinga, cricket news, sports news, sports, cricket, latest cricket news, latest sports news

Indian captain Virat Kohli eyes on achiving dual personal record in pallekale odi. Along with kohli, Lasith Malinga is also on the threshold of personal milestones which they can achieve during the course of this series.

రెండో వన్డేలో.. రెండు రికార్డులపై కోహ్లీ నజర్..

Posted: 08/23/2017 06:19 PM IST
Virat kohli eye personal milestone in second odi

టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ మరో రెండు మైలురాళ్లకు చేరువలో ఉన్నాడు. శ్రీలంకతో గురువారం పల్లెకలెలో జరగనున్న రెండో వన్డేలో కోహ్లీ ఈ రికార్డులను అధిగమించేందుకు ఆయన దృష్టి సారించాడు. అయితే రెండు రికార్డులను సాధించే క్రమంలో ఆయన చేయాల్సిందల్లా రెండు విభిన్న టాస్కులు కాదు. కేవలం తన బ్యాటు నుంచి పరుగులను జాలువారనిస్తే చాలు. ఆయన 62 పరుగులు సాధించడంతో ఈ రెండు రికార్డులను అందుకున్న వాడిగా నిలిచిపోతాడు.

 ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో వన్డేలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా అగ్రస్థానంలో నిలవాలంటే.. సఫారీ జట్టుకు చెందిన క్రికెటర్ డుప్లిసిస్ ను అధిగమించాల్సిన అవసరం విరాట్ కోహ్లీ ఎదుట వుంది. ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో 769 పరుగులు సాధించి మూడో స్థానంలో ఉన్న విరాటుడు.. మరో 46 పరుగులు సాధిస్తే ఈ క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ జాబితాలో నిలచిపోతాడు. ప్రస్తుతం ఈ జాబితాలో డు ప్లిసెస్‌ 814 పరుగులతో మొదటి స్థానంలో, ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ రూట్‌ 785 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

దక్షిణాఫ్రికా ఓపెనర్‌ డు ప్లిసెస్‌కు 45 పరుగుల దూరంలోను, ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ రూట్‌కు 16 పరుగుల దూరంలో ఉన్నాడు. మొదటి వన్డేలో కోహ్లీ 82 పరుగులు చేయటం వల్ల మూడో స్థానంలో ఉన్న మోర్గాన్‌ను అధిగమించాడు. ఇదే జోరును రెండో వన్డేలో కొనసాగిస్తే కోహ్లీ వారిద్దరి రికార్డులను అధిగమించి అగ్రస్థానంలో నిలుస్తాడు. శ్రీలంక పర్యటనలో ఉన్న టీమిండియా మొదటి వన్డేలో విజయం సాధించిన విషయం తెలిసిందే. శిఖర్‌ ధావన్‌, కోహ్లీల భాగస్వామ్యం మొదటి వన్డేలో 197 పరుగులు సాధించింది.

2 మలింగాకు మరో రెండు వికెట్లు లభిస్తే 300 వికెట్ల క్లబ్ లో చేరుతాడు.

46 కోహ్లీకి 46 పరుగులు లభిస్తే.. ఈ ఏడాదిలో అత్యధిక పరుగులు చేసినవాడవుతాడు.

62 అదే కోహ్లీ 62 పరుగులు చేస్తే.. శ్రీలంకపై 42 వన్డేల్లో 57 పరుగుల సగటున రెండు వేల పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచిపోతాడు

29 మాథ్యూస్ 29 పరుగులు జోడిస్తే భారత్ పై 32 వన్డేల్లో వెయ్యి పరుగులు సాధించిన వాడిగా నిలుస్తాడు.

2 టీమిండియా మాజీ కెప్టెన్ ధోని మరో రెండు స్టంపులు సాధిస్తే 297 వన్డేల్లో శతక స్టంపులు సాధించిన కీపర్ గా నిలుస్తాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  vandes  Faf Du Plessis  MS dhoni  stumpings  lasith malinga  cricket  

Other Articles